Share News

Rajanna Sircilla: గురుకుల పాఠశాల భవన నిర్మాణపనులు వెంటనే పూర్తిచేయాలి

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:17 AM

రుద్రంగి, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని గైదిగుట్ట తండాలో నిర్మాణంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠ శాల భవన నిర్మాణ పనులను వేగవంతంచేసి, త్వరగా పూర్తిచే యాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 Rajanna Sircilla:  గురుకుల పాఠశాల భవన నిర్మాణపనులు వెంటనే పూర్తిచేయాలి

- మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

రుద్రంగి, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని గైదిగుట్ట తండాలో నిర్మాణంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠ శాల భవన నిర్మాణ పనులను వేగవంతంచేసి, త్వరగా పూర్తిచే యాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆది వారం గురుకులపాఠశాల భవ నాన్ని ఆయన బీఆర్‌ఎస్‌ నాయకు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు చేపట్టాల్సిన పనులు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు సేకరిం చారు.

అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు అన్నివసతులతో కూడిన సొంత భవనం అందు బాటులోకి వస్తే ఎంతోసౌకర్యంగా ఉంటుంద న్నారు. అందువల్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమ స్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురా వాలని సూచించారు.

మూడునెలల్లో భవన నిర్మాణపనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువ స్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:17 AM