Rajanna Sircilla: కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:21 AM
తంగళ్లపల్లి, అక్టోబర్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పద్మనగర్ శివారులోని కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
తంగళ్లపల్లి, అక్టోబర్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పద్మనగర్ శివారులోని కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కిచెన్ ఆవరణ, ఫ్రీజర్, సరుకులు తనిఖీచేసి అధికా రులకు పలు సూచనలు చేశారు. అలాగే ఫిర్యాదుల బాక్స్‌ను పరిశీలించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా లయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. ఫిర్యాదుల బాక్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందిం చాలని ఆయాసమస్య లు రాకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.