Rajanna Sircilla:భారీ బందోబస్తుమధ్య సీఎం పర్యటన
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:16 AM
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం భారీ బందోబస్తు మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు జరిగింది.
- 1600మంది పోలీసులతో గట్టి బందోబస్తు
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం భారీ బందోబస్తు మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు జరిగింది. మొట్టమొదటి సారీగా ముఖ్యమంతి హోదాలో రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా 16వందల పోలీసులతో పటిష్ట భధ్రతా ఏర్పాట్లనుచేశారు. భారీగా జనసమూహానికి అనుగుణంగా పోలీసులు మోహరించారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం పట్టణంలో చేపట్టిన పాదయాత్రకు భారీగా పోలీసులు మధ్య సాగింది. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా గత మూడు రోజు నుంచి సిరిసిల్లలో మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ సన్‌ప్రతీసింగ్, ఐఎస్‌డబ్ల్యూ, డైరెక్టర్ (రిటైర్డ్) వీబీ కమలాసన్‌రెడ్డి, సీఎం భధ్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీమహేష్‌బీగీతే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, అసిఫాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌లు ఉండి నిత్యం రక్షణ, భధ్రత చర్యలు చేపట్టారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌తోపాటు కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సభ వేధిక ప్రత్యేకంగా పర్యవేక్షించారు. బుధవారం పర్యటన సందర్భంగా జిల్లాతోపాటు పలు జిల్లాలకు చెందిన 16వంద మంది పోలీసులను రప్పించి పటిష్టమైన భఽధ్రతను ఏర్పాటు చేశారు. ఈ బందో బస్తుకు ఇద్దరు అదనపు ఎస్పీలు, 15మంది డీఎస్పీలు, 50మంది సీఐ, అర్‌ఐలు, 148మంది ఎస్‌ఐ, అర్‌ఎస్‌ఐలు, 328 మంది ఎఎస్‌ఐ, హెడ్‌కాన్సిస్టేబుల్‌లు, 482 మంది కాన్సిస్టేబుళ్లు, 121 మంది మహిళా సిబ్బంది, 196 మంది హోంగార్డులు, 60 మంది బెటాలియన్ సిబ్బంది, 190 మంది జిల్లా గార్డ్స్‌లతో చేపట్టారు. సీఎం వస్తున్న సందర్భంగా పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయించడంతోపాటు సిరిసిల్ల- కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడ రూట్‌లను మూసి వేసి వాహనాలను రెండు బైపాస్ రోడ్ల గుండా తరలించారు. సీఎం పర్యటన ప్రశాంత వాతావరణంలో ముగియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు.