Share News

Rajanna Sircilla: పేదలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:40 AM

వేములవాడ రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా సీఎం సహాయనిధి అని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ అన్నారు.

Rajanna Sircilla:  పేదలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా సీఎంఆర్‌ఎఫ్‌
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

- విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా సీఎం సహాయనిధి అని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ అన్నారు.రూరల్‌ మండలంలోని 38మంది లబ్ధిదారులకు రూ.13.92 లక్షలు, అర్బన్‌ మండలపరిధిలోని 31మంది లబ్దిదా రులకు రూ.9.47లక్షల విలువైన సీఎం సహా యనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో శనివారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికఇబ్బందులతో చికిత్స పొందుతున్న పేదమధ్యతరగతి కుటుంబాలకు సీఎం ఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రూరల్‌మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్‌, అర్బన్‌ మండల అధ్యక్షుడు వంగ పర్శరా ములు, ఫ్యాక్స్‌ చైర్మెన్లు వకులాభరణం శ్రీనివాస్‌, పిల్లి కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ విగ్రహాన్ని

ఆవిష్కరించిన విప్‌

చందుర్తి : మాజీప్రధాని ఇందిరాగాంధీ ఆశ యాలు, స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్‌ హౌస్‌ను ప్రారంభించిన అనంతరం, బస్టాండ్‌లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని విప్‌ ఆది శ్రీని వాస్‌ ఆవిష్కరించారు. మండలపరిధిలోని 61మంది లబ్ధిదారులకు 16లక్షల51వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీచేశారు. తిమ్మాపూర్‌ గ్రామంలో మహిళాసమైక్య సంఘభవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆదిశ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ కేవ లం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ఆమె దేశానికి చేసిన సేవలను నేటి తరానికి పరిచయం చేసే గొప్ప ప్రయత్నమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవిందర్‌రెడ్డి, ఎంపీడీవో రాధ, ఆత్మకమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, ఏపీఎం కళ్యాణి, సర్పంచ్‌లు పులి సత్తయ్య, బోజ్జ మల్లేశం, కాపిల్ల శంకర్‌, నాయకులు నాగం కుమార్‌, గసికంటి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:40 AM