Share News

Rajanna Sircilla: సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:23 AM

సిరిసిల్ల, అక్టోబరు 24 (ఆంరఽధజ్యోతి): సీఎం ఆర్‌ లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ ఆదేశిం చారు.

Rajanna Sircilla:   సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

- రైస్‌ మిల్లర్లతో సమీక్షలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

సిరిసిల్ల, అక్టోబరు 24 (ఆంరఽధజ్యోతి): సీఎం ఆర్‌ లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్‌లో యాసంగి 2024-25, అలాగే 2025-26ఖరీఫ్‌, యాసంగిసీజన్‌ సీఎంఆర్‌ డెలివరీ తదితర అంశాలపై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తోకలిసి రైస్‌మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ.. రైస్‌మిల్లులకు రోజువారీ లక్ష్యాలు నిర్ణ యించి, వాటిపై సమీక్షించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఏ రైస్‌మిల్లులు లక్ష్యసాధన లో వెనుకబడి ఉన్నాయో గుర్తించాలని, నిర్వా హకులతో సమావేశం ఏర్పాటుచేసి సీఎంఆర్‌ డెలివరీ చేయించా లని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కచ్చితంగా రైస్‌మిల్లర్లు ముందుకు వెళ్లాలని ఆదేశిం చారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి తనూజ, డీఎం గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల శ్రమ

సిరిసిల్ల టౌన్‌ : ప్రతీ విద్యార్థి విజయం వెనుక వారి తల్లిదండ్రుల శ్రమ, ప్రోత్సాహం ఉంటుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో వైట్‌కోర్టు సెర్మనీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథు లుగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గీతె హాజరై జ్యోతి ప్రజ్వల చేసి వేడుకలను ప్రారంభించారు. వైద్య విద్యార్థు లకు కలెక్టర్‌, ఎస్పీ వైట్‌కోర్టులను అందజేసి అభినందిం చారు. అనంతరం వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది విద్యార్థులు కలెక్టర్‌, ఎస్పీని సన్మానించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ మాట్లాడారు. సమా జంలో వైద్యవిద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వైద్యులు తాము ఎంచుకున్న విభాగంలో ఉన్నతస్థానా లకు ఎదగాలని సమాజసేవలో భాగంగా వైద్యులు కొందరికైన ఉచిత వైద్యసేవలు అందించాలని సూచించారు. ఉచిత వైద్యసేవలో ఆత్మ సంతృప్తి ఉంటుందని అన్నారు. వైద్యులు కూడా వారి ఆరోగ్య ఆహారం పట్ల శ్రద్ధపెట్టాలని సూచించారు. మెడికల్‌ కళాశాల, బాలుర హాస్టల్‌ నిర్మాణపనుల్లో వేగం పెంచి త్వరలోనే వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వివరిం చారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, వైస్‌ ప్రిన్సిపల్‌ నిర్విష, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌, అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:23 AM