Rajanna Sircilla: సీఎం పర్యటన నేపథ్యంలో బీఅర్‌ఎస్, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:12 AM
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలో నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకోకుండా వేకువజాము నుంచే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
- ముఖ్య నాయకులను హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలో నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకోకుండా వేకువజాము నుంచే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ, ఆటో యూనియన్ నాయకులను అరెస్ట్‌చేశారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకవాహనంలో గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ సర్పంచులు సుభాష్, రమేశ్, శరవింద్, నర్సింలు, బాలరాజునర్సాగౌడ్, తిరుపతినాయక్, మాజీఏఎంసీ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు శంకర్‌నాయక్, కిషన్, పర్శరాములు, శ్రీనివాస్, జబ్బార్, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సందీప్, లక్ష్మణ్ దేవరాజు, మధు, ప్రమోద్, నాగరాజు, అజిమోద్దిన్, రాము, బీజేపీ నాయకులు రంజిత్‌కుమార్, జితేందర్‌రెడ్డి, కుమార్, ప్రకాశ్, మహేశ్, ఆటో యూనియన్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
వేములవాడ రూరల్: బీఆర్‌ఎస్, బీజేపీ నాయ కులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బుధ వారం ఉదయమే వేములవాడరూరల్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, కట్కం మల్లేశం, పెండ్యాల తిరుపతి, నాగుల వేణు, పసుల అంజిబాబు, ఎడపెల్లి మహేష్, దేవరాజు బీజేపీ నాయకుడు జక్కుల తిరుపతి, వేములవాడ బీజేపీ నాయకులు ముత్యం, బోనాల శివలను పోలీసులు అరెస్టు చేసారు.
ఇల్లంతకుంట : మండలంలో వివిధ పార్టీల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సీఎం సమావేశానికి అడ్డంకులు సృష్టిస్తారని భావిం చిన పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకొని పోలీ్ సస్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ నాయకులు రాగటి రమేష్, బిల్లవేని పర్శరాం, చందన్, రడం ప్రవీణ్, గొట్టెపర్తి పర్శరాం, పట్నం శ్రీనివాస్, కేవీఈ ఎన్‌రెడ్డి, సలీం, శ్రీనివాస్, గుంటి మధు, కెశవేని శ్రీని వాస్, పట్నం మహేందర్, అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్, ఏబీవీపీ నాయకుడు అక్కెం నాగరాజు, ఆటో చూనియన్ అధ్యక్షుడు ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
కోనరావుపేట : మండలబీఆర్‌ఎస్, బీజేపీ ఏబీవీపీ, సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. అరెస ్టయిన వారిలో సెస్ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, కుంటెల్లి నాగరాజు, కాశవేణి మహేష్, పూజ్యం కార్తీక్, ఎగమంటి ఎల్లారెడ్డి ఉన్నారు.
గంభీరావుపేట : మండలంలో బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరళించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, పట్టణ అధ్య క్షుడు వెంకటి, పార్టీ నాయకులు లింగమ్‌యాదవ్, గంద్యాడపు రాజు, వార్డు సభ్యులు రాజనర్సు, స్వామి, ప్రశాంత్, యూత్, విద్యార్థి నాయకులు బిక్షపతి, కళ్యాణ్, అక్షయ్ ఉన్నారు.
తంగళ్లపల్లి : మండలంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్‌చేశారు. కొంత మందిని తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, మరికొంద రిని ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ ఎస్ నాయకులు కోడి అంతయ్య, మాట్ల మధు, ఎగు మామిడి వెంకటరమణరెడ్డి, పడిగెల రాజు, పుర్మాణి రాజశేఖర్‌రెడ్డి, చిలెవేరి చిరంజీవి, పడిగెల మానస, గనప శివజ్యోతి, సురభి నవీన్‌రావ్, గుండు ప్రేమ్ కుమార్, అలువాల సాయి, ఆబుబకర్, చీమల ప్రశాంత్, చెన్నవేని పర్శరాములు తదితరులు ఉన్నారు.
ముఖ్యనాయకుల హౌస్ అరెస్ట్..
సిరిసిల్ల అర్బన్ : సిరిసిల్ల జిల్లాకేంద్రంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం తెల్లవారుజామున బీఅర్‌ఎస్, బీజేపీ నాయకులను పోలీ సులు ముందస్తు అరెస్ట్‌చేసి ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టణంలోని బీఅర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీలను పోలీసులు హౌజ్‌అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన కంచర్ల రవిగౌడ్, మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజుగౌడ్, బత్తుల శ్రీనివాస్, మెంగని మనోహార్, అటో డ్రైవర్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌లతోపాటు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బూర విష్ణులతోపాటుపలువురి ఇళ్లలోకి వెళ్లి ముందస్తుగా అరెస్ట్‌చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.