Share News

Rajanna Sircilla: ‘నా ఊరి శుభ్రత.. నా బాధ్యత’గా ప్రతీ ఒక్కరు భావించాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:19 AM

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్ర జ్యోతి) : సమాజంలో ప్రతీఒక్కరు నా ఊరి శుభ్రత.. నా బాధ్యతగా భావించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి అన్నారు.

Rajanna Sircilla:   ‘నా ఊరి శుభ్రత.. నా బాధ్యత’గా ప్రతీ ఒక్కరు భావించాలి
మురికి కాలవను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి

- మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్ర జ్యోతి) : సమాజంలో ప్రతీఒక్కరు నా ఊరి శుభ్రత.. నా బాధ్యతగా భావించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం లోని నెహ్రూనగర్‌, సుభాష్‌నగర్‌, గాంధీన గర్‌గుండా ప్రవహించే ప్రధాన మురికి కాలువలో పేరుకపోయిన ప్లాస్టిక్‌వ్యర్థాలు, మురికిషీల్డ్‌, మురికికాలవలో పూడిక తీయడంతో పాటు ప్రధాన మురికికాలవ వెంట పెరిగిన పిచ్చిమొక్కలను మున్సిపల్‌ ఆధ్వర్యంలో తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, అధికారులు పరిశీ లించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంను పరిశు భ్రంగా ఉంచడంలో ప్రజలంతా భాగస్వా ములు కావాలన్నారు. బహిరంగ ప్రదేశాల లో చెత్తను పడవేయకుండా ఇంటి ముం దుకు వచ్చే మున్సిపల్‌ వాహన సిబ్బందికి అందించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తనుపడవేసే వారిని గుర్తించి మున్సిపల్‌ ఆధ్వర్యంలో జరిమానాలు విధి స్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు జిందం చక్రపాణి, మున్సి పల్‌ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సందేశంతో కూడిన పాటలను చిత్రీకరించాలి..

కళాకారులు సందేశంతో కూడిన పాట లను చిత్రీకరించాలని మున్సిపల్‌చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి అన్నారు. శనివారం జిల్లా కేంద్రం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రొడ్యూసర్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో నిర్మించిన రింగురింగు గోల్డ్‌రింగు ఫోక్‌సాంగ్‌ ప్రోమో ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సిరిసిల్ల కళలకు పుట్టినిల్లు అని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత సి నారాయణరెడ్డి స్ఫూర్తిగా తీసుకొని కళాకారులు సిరిసిల్లకు మరింత ఖ్యాతిని తీసుకురావాలని అన్నా రు. సాంగ్‌ను చిత్రికరించిన ప్రకాష్‌తోపాటు నటులు రామ్‌, హర్షితను అభినందించారు. కార్యక్రమంలో సాంగ్‌ ప్రొడ్యూసర్‌ ప్రకాష్‌, నటీనటులు రామ్‌, హర్షిత, సాంగ్‌బృందం, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్లసందీప్‌, కౌన్సి లర్లు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు ఎండీసత్తార్‌, బీఆ ర్‌ఎస్వీ నాయకుడు రవిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:19 AM