Share News

Rajanna Sircilla: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచాలి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:17 AM

ఇల్లంతకుంట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రత్యా మ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచ వలసిన బాధ్యత అధికారులు, సర్పంచ్‌లపై ఉందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారా యణ అన్నారు.

Rajanna Sircilla: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచాలి

ఇల్లంతకుంట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రత్యా మ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచ వలసిన బాధ్యత అధికారులు, సర్పంచ్‌లపై ఉందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారా యణ అన్నారు. మండలపరిషత్‌ కార్యాలయంలో శని వారం ప్రత్యేకాధికారి రామకృష్ణ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే విని యోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాబో యే రోజుల్లో నీటిఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. పశుపక్ష్యాదులతో పాటు ప్రజలకు నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున పొదుపుగా వాడుకోవాలన్నారు. రైతులు వరిపంటను ఎట్టిపరిస్థితుల్లోను సాగుచేయ వద్దని అవసరమైతే గ్రామాలలో సమావేశాలు ఏర్పా టు చేసి అధికారులు పూర్తి వివరాలు తెలపాలన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగుచేయా లన్నారు. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు మాట్లాడుతూ మండలకేంద్రంలో విద్యుత్‌ సమస్యలు ఎక్కువగా వస్తున్నందున అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. రేపాక సర్పంచ్‌ కాత మల్లేశం మాట్లా డుతూ శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించిన వారినుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. వల్లంపట్ల సర్పంచ్‌ విజయ్‌ మాట్లా డుతూ పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెల్జీపూర్‌ సర్పంచ్‌ నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఆశాకార్యకర్తను నియ మించాలని, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేసినందు కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ రాచకట్ల సురేష్‌, ఎంపీడీవో శశికళ, తదితరులు పాల్గొన్నారు.

ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీ

మండలంలోని వివిధ గ్రామాల్లో పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి ఇంటి మంజూరు ప్రొసీ డింగ్‌ పత్రాలను ఎమ్మెల్యే సత్యనారాయణ పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి గృహప్రవేశాలు చేయించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

రైతుల సంక్షేమానికి

ప్రాధాన్యం ఇవ్వాలి

ఇల్లంతకుంట : మార్కెట్‌ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మార్కెట్‌ కమిటీ పాలకవర్గం శనివారం ఎమ్మెల్యేను కలువగా అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులను అప్రమత్తత చేయ వలసిన అవసరం ఉందన్నారు. పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుంద న్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ అంతగిరి సాహితీవినయ్‌కుమార్‌, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, ఉపాధ్యక్షుడు భరత్‌రెడ్డి, డైరెక్టర్లు వరుకోలు మల్లయ్య, బడుగు లింగం, వాడె శ్రీనివాస్‌రెడ్డి, జెట్టి మల్లేశం, మంద బాల్‌రెడ్డి, వెలిచాల జ్యోతి, బంగారి అంజయ్య, ఎరుకల తిరుపతి, జుట్టు నగేష్‌, మాతిరెడ్డి నవీన్‌రెడ్డితో పాటు నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:17 AM