Rajanna Sircilla: వర్షపు నీరు సంరక్షణ, నీటి పొదుపుపై అవగాహన
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:01 AM
సిరిసిల్ల టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జల్‌శక్తి అభియాన్- జేఎస్ జేబీ 3.0క్యాచ్‌ది రైన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ-నీటి పొదుపుపై ఆదివారం పట్టణంలో మున్సిపల్ అధికారులు అవగాహన
సిరిసిల్ల టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జల్‌శక్తి అభియాన్- జేఎస్ జేబీ 3.0క్యాచ్‌ది రైన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ-నీటి పొదుపుపై ఆదివారం పట్టణంలో మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్ణణంలోని ప్రధాన కూడళ్ల వద్ద క్యాచ్ ది రైన్‌పై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయిం చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషా మాట్లాడుతూ క్యాచ్ ది రైన్ కార్యక్రమం పట్టణంలో ఆగస్టు5 వరకు కొనసాగుతుందన్నారు. వర్షపునీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటిపొదుపు యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామ న్నారు. నీటి వనరులను పరిరక్షిస్తూ ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో, సంస్థ లలో వర్షపు నీటిని సంరక్షించే విధానాన్ని వివరిస్తామన్నారు. పట్టణ ప్రజలందరు క్యాచ్‌ది రైన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నీటిసంరక్షణకు సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.