Rajanna Sircilla: రేపు ఆరుగురు మంత్రులు రాక
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:13 AM
బోయినపల్లి, జూలై 4 (ఆంధ్ర జ్యోతి): హైబ్రిడ్ ఆన్యుటి మోడల్ (హ్యామ్) రోడ్ల మౌలిక సదుపా యాల కల్పనలో భాగంగా సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో 346.87 కోట్లతో 229.03కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ రానుంది.
రూ.346కోట్లతో రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరణ
బోయినపల్లి, జూలై 4 (ఆంధ్ర జ్యోతి): హైబ్రిడ్ ఆన్యుటి మోడల్ (హ్యామ్) రోడ్ల మౌలిక సదుపా యాల కల్పనలో భాగంగా సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో 346.87 కోట్లతో 229.03కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ రానుంది. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6 బోయినపల్లి మండలం కొదురుపాకలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగ నుంది. పైలాన్‌నిర్మాణపనులను ఆర్‌అండ్‌బీ అధికారులు శనివారం పరిశీలిం చారు. ఈ కార్యక్రమానికి ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పైలాన్‌నిర్మాణాన్ని పరిశీలించిన వారిలో ఈఈ నరసిం హచారి, డీఈలు కిరణ్, వరప్రసాద్, శాంతయ్య, నాయకులు కత్తెరపాక సుధాకర్, నాగుల వంశీ, బండి శ్రీనివాస్, శాలివాన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.