Share News

రైతుల సొమ్ముతో ‘రాహుల్‌ బంధు’ పథకం

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:00 AM

మోసపోతే గోసపడతారని కేసీఆర్‌ ఆనాడే చెప్పాడని రైతుబంధు డబ్బులు నాట్లు వేసే సమయానికి వేసే వారని ఇప్పుడు కోతలకు వచ్చిన రైతుబంధు రాలేదని, రైతుల సొమ్ముతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక కొత్త పథకాన్ని, ‘రాహుల్‌ బంధు’ మొదలుపెట్టాడని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రైతుల సొమ్ముతో ‘రాహుల్‌ బంధు’ పథకం

సిరిసిల్ల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మోసపోతే గోసపడతారని కేసీఆర్‌ ఆనాడే చెప్పాడని రైతుబంధు డబ్బులు నాట్లు వేసే సమయానికి వేసే వారని ఇప్పుడు కోతలకు వచ్చిన రైతుబంధు రాలేదని, రైతుల సొమ్ముతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక కొత్త పథకాన్ని, ‘రాహుల్‌ బంధు’ మొదలుపెట్టాడని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనంలో కాంగ్రెస్‌, బీజేపీ, వివిధ యువజన సంఘాల్లోని నాయకులు,సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం చేశారు. అనంతరం ముస్లీంలకు ఇచ్చిన ఇప్తారు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సంవత్సరానికి రూ వెయ్యి కోట్లు రాహుల్‌ గాంధీకి ఇచ్చే రాహుల్‌ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతు బంధు వస్తుంద ని, కాంగ్రెస్‌ పార్టీ పెంచి ఇస్తామన్న నిధులను ఇస్తుందని ఎదురుచూ స్తూ ఉంటే, రేవంత్‌రెడ్డి రైతు బంధును ఎగగొడుతున్నాడని మండిప డ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును పక్కన పెట్టి రాహుల్‌ బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సీటును కాపాడుకుంటు న్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి సామంతు రాజు లెక్క రాహుల్‌ గాంధీ ఢిల్లీ గద్దెకు కప్పం కడుతూ ఉన్నాడని అన్నారు. రేవంత్‌ రెడ్డి ఇల్లు రెడ్డికుంట చెరువు శిఖరంలో ఉందని, తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు లో, పొంగులేటి, వివేక్‌, పట్నం మహేందర్‌ రెడ్డిల ఇల్లు కూడా బఫర్‌ జోన్‌లోనే ఉన్నాయని కానీ ఆ ఇళ్ల జోలికి వెళ్లడం లేదన్నారు. గరీబ్‌ల ఇళ్లను కూలుస్తున్నారని ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చడ మేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల కు చట్టబద్ధత కల్పిస్తామని చెయ్యనందుకు ప్రధాన ప్రతిపక్షంగా శాసన సభ సమావేశాల్లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టి ఆరు గ్యారెంటీల చట్టబ ద్ధతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్‌ అన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు

సిరిసిల్లలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధికి మళ్లీ బీఆర్‌ ఎస్‌ పార్టీని గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కేటీఆర్‌ అన్నారు. సోమవారం సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో సిరిసి ల్ల, వేములవాడ బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లను సన్మానించారు. అంత కుముందు సుభాష్‌నగర్‌లో రూ 86 లక్షలతో నిర్మించిన మహిళా కమ్యూ నిటీ భవనాన్ని ప్రారంభించారు. మున్సిపల్‌ మహిళ కార్మికులకు ప్రశం సా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సిరి సిల్ల మున్సిపాలిటీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ 44 కోట్లతో పనులు మం జూరు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రజల మనస్సులు గెల వాలంటే రెట్టింపు పనులు మంజూరుచేయాలని, పనులు రద్దు చేయడం మంచి పాలన అనిపించుకోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ 25 లక్షల చొప్పున నిధులు వెచ్చించి అనేక కమ్యూనిటీ భవనాలు నిర్మించా మని గుర్తు చేశారు.

మైనార్టీ డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ మోసం

ఎన్నికల్లో మైనార్టీ డిక్లరేషన్‌ పేరుతో ముస్లింలకు హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ మోసం చేసిందని కేటీఆర్‌ అన్నారు. సోమవారం సిరిసిల్లలో షాదీఖానాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తోపా ఇస్తే కాం గ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కేసీఆర్‌ ముస్లిం పిల్లల కోసం రెసిడె న్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు చేశామన్నారు. సిరిసిల్ల షాదీఖానాలో ఉన్న సమస్యలను పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌లు తుల ఉమ, అరుణ, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయ కుడు చీటీ నర్సింంగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిప ల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాష, వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, కౌన్సిలర్‌ దార్నం అరుణ, నాయకులు మ్యాన రవి, బొల్లి రాంమోహన్‌, మంచె శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, దార్నం లక్ష్మీనారాయణ, వేములవాడ మాజీ చైరపర్సన్‌ మాధవి, మసీదు కమిటీ అధ్యక్షుడు షమీ, మాజీ అధ్యక్షులు సత్తార్‌, యూసుఫ్‌, ప్రతినిధులు ఉస్మాన్‌, మోసిన్‌, మన్సూర్‌, రఫీ, అక్రమ్‌, అబ్దు ల్‌ మోసిన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 01:01 AM