Raajanna siricilla : మున్సిపాలిటీల పగ్గాలు మళ్లీ ‘ఆమె’కే..
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:00 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు ఈసారైనా మార్పు జరుగుతుందని, పురుషులకు అవకాశం వస్తుందని ఆశగా ఉన్న నేతలకు నిరాశే మిగిలింది.
ఫ సిరిసిల్ల చైర్‌పర్సన్ జనరల్ మహిళగా రిజర్వ్..
ఫ నీరుగారిన నేతల ఆశలు
ఫ ఏడోసారి ఎన్నికలు.. ఆరుసార్లు మహిళలకే అవకాశం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు ఈసారైనా మార్పు జరుగుతుందని, పురుషులకు అవకాశం వస్తుందని ఆశగా ఉన్న నేతలకు నిరాశే మిగిలింది. సిరిసిల్ల మున్సి పాలిటీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఏడోసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానం మళ్లీ మహిళకే అవకాశం దక్కింది. శనివారం సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్, పార్టీల రిజర్వేషన్లు ఖరారు కావడంతో చేజారిన రిజర్వేషన్లతో కొం దరి ఆశావహులకు నిరాశ మిగిలింది. మరికొందరికి అను కూలంగా రిజర్వేషన్లు రావడంతో సంబరంగా ఉన్నారు. ప్ర ధానంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్ మాత్రం నేతల ఆశలను ఆవిరిచేసింది. 1987లో సిరిసిల్ల గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. అప్పుడు జరిగిన తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా కాంగ్రెస్ చెంది న రుద్ర సత్తమ్మ గెలుపొందారు. 1985లో కూడా బీసీ మహిళకు అవకాశం రాగా టీడీపీకి చెందిన గుండ్లపల్లి సరో జన, 2000 సంవత్సరంలో బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో పాటు ప్రత్య క్ష ఎన్నికలు జరగగా బీజేపీకి చెందిన ఆడేపు రవీందర్ గెలుపొందారు. 2005లో పరోక్ష ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వుడ్ కావడంతో టీడీపీకి చెందిన గుడ్ల మంజుల, 2014లో మళ్లీ బీసీ మహిళకు కేటాయించడంతో బీఆర్‌ఎస్ కు చెందిన సామల పావని, 2020లో మళ్లీ బీసీ మహిళకు అవకాశం రావడంతో బీఆర్‌ఎస్‌కు చెందిన జిందం కళలు ఎంపికయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ పగ్గాలు ఒక్కసారి మినహా ఐదుసార్లు మహిళకే అవకాశం దక్కింది. ఈసారి మార్పు ఉంటుందని భావించిన జనరల్ మహిళగా రిజర్వ్ కావడంతో చైర్‌పర్సన్ స్థానం కోసం మహిళపై దృష్టి పెట్టే పరిస్థితి పార్టీలో నెలకొంది. మరోవైపు తాము పోటికి సిద్ధమైన చైర్‌పర్సన్ పదవి కోసం వారసులుగా భార్య లను రంగంలోకి దింపే యోచనలో నేతలు పడ్డారు.
వేములవాడ బల్దియా పీఠం బీసీ జనరల్‌కు..
వేములవాడ: వేములవాడ పట్టణం మున్సిపల్‌గా రూపాంతరం చెందిన తరువాత రెండు పర్యాయాలు ము న్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. గత రెండు మున్సిపల్ ఎన్నికల్లో గత ప్రభుత్వం బీసీ మహిళకే రిజర్వేషన్ ఖరారు చేసింది. మొదటిసారి చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటా యించగా నామాల ఉమ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక య్యారు. రెండవసారి కూడా బీసీ మహిళకే కేటాయించ డంతో రామతీర్థపు మాధవి మున్సిపల్ చైరపర్సన్ పీఠం దక్కించుకుంది. ప్రస్తుతం నిర్వహించే మూడవసారి మున్సి పల్ ఎన్నికల్లో బీసీ జనరల్ స్థానం కేటాయించడంతో చైర్మన్ పదవికి తీవ్రస్థాయిలో పోటీ ఉండబోతుందనే చర్చ పట్టణంలో జోరుగా ఊపందుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠా న్ని మొదటిసారి బీసీ జనరల్‌కు కేటాయించింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని వార్డు ల వారీగా రిజర్వేషన్‌లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. పట్టణంలోని 28 వార్డులకు జనరల్, జనరల్ మహిళలను కలిపి 14 స్థానాలు కేటాయించగా బీసీ జనరల్, బీసీ మహిళలకు 09 స్థానాలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలకు 4 స్థానాలు, ఎస్టీలకు ఒక్క స్థానాన్ని కల్పించారు. వార్డుల వారిగా రిజర్వేషన్‌లు ఇలా ఉన్నాయి. 1వ వార్డు బీసీ మహిళ, 2వ వార్డు జనరల్ మహిళ, 3వ వార్డు ఎస్సీ మహిళ, 4వ వార్డు జనరల్, 5వ వార్డు జనరల్ మహిళ, 6వ వార్డు జనరల్, 7వ వార్డు జనరల్, 8వ వార్డు బీసీ జనరల్, 9వ వార్డు జనరల్ మహిళ, 10 వార్డు జనరల్ మహిళ, 11వ వార్డు బీసీ మహిళ, 12వ వార్డు ఎస్టీ జనరల్, 13వ వార్డు ఎస్సీ మహిళ, 14వ వార్డు జనరల్, 15వ వార్డు బీసీ జనరల్, 16వ వార్డు బీసీ జనరల్, 17వ వార్డు ఎస్సీ జనరల్, 18వ వార్డు జనరల్, 19వ వార్డు జనరల్ మహిళ, 20వ వార్డు ఎస్సీ జనరల్, 21వ వార్డు బీసీ జనరల్, 22వ వార్డు జనరల్ మహిళ, 23వ వార్డు బీసీ మహిళ, 24వ వార్డు బీసీ జనరల్, 25వ వార్డు జనరల్, 26వ వార్డు జనరల్ మహిళ, 27వ వార్డు బీసీ మహిళ, 28వ వార్డు జనరల్ మహిళకు కెటాయించారు.