Raajanna siricilla : శివోహం
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:18 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మహాశివరాత్రికి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యా యి. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు.
- జిల్లాలో మహాశివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
- వేములవాడ భీమేశ్వరాలయంలో వేడుకలు ప్రారంభం
- ఉపవాసాలు, జాగరణలతో మహాశివుడి నామస్మరణ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మహాశివరాత్రికి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యా యి. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన వేడుకల కు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేములవాడ రాజరాజే శ్వరస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో ఉండటంతో ఈసా రి భీమేశ్వరాలయలో శనివారం వేడుకలు ప్రారంభమయ్యా యి. దేవాలయాల వద్ద క్యూలైన్లు, చలువ పందిళ్లు వేశారు. దేవాలయాల వద్ద జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృ తిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో అన్ని పండుగలు పగలు జరుపుకుంటారు. రాత్రి సమయాల్లో జరుపుకునే ముఖ్య పండుగల్లో దీపావళి, తర్వాత శివరాత్రి మాత్రమే. శివరాత్రి రోజున ప్రతి శివ భక్తుని హృదయంలో వేద నాదాలతో శివనా మం ప్రతిధ్వనిస్తుంది. శివరాత్రి పర్వదినాల్లో శివదీక్షపరుల్లో భక్తి ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. శివరాత్రి జాగరణ మానవ జీవితాల నుంచి కష్టాల నుంచి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలు కురిపిస్తుందనే నమ్మకం. ప్రతి శివా లయంలో శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తన్మయత్వం లో జరుపుకుంటారు. శివరాత్రి రోజు స్వామి లింగోద్భవుడై భక్తు లను అనుగ్రహిస్తాడు. జిల్లాలోని వేములవాడ రాజన్న క్షే త్రంతోపాటు జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఉపవాస దీక్షలో ఉండే భక్తులు శివాలయాలను సందర్శించి స్వామివారికి పూజలు చేయనున్నారు.
జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మ హాశివరాత్రి సందర్భంగా తెల్లవారు జామున 4గంటల నుం చి నిత్యపూజ కార్యక్రమాలతో పాటు ఉదయం 5 గం టలకు విఘ్నేశ్వర పూజ, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతర జలాభిషేకం, సాయంత్రం 6 గంటలకు అఖండ ధీపారాధన, రాత్రి 12 గంటలకు లింగో ద్భవం, రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించను న్నారు. సోమవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో శివాలయం, విశ్వనాథస్వామి దేవస్థానంతో పాటు ఆయా మండలాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
భక్తజనసంద్రంగా వేములవాడ..
వేములవాడ టౌన్ : వేముల వాడలో మహాజనజాతర ప్రారంభమైంది. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భం గా వేములవాడ భక్తజనసంద్రమైంది. శనివారం ఉదయం ఆలయపరిసరాలు పలుచగా కనిపించినా సాయంత్రం వర కు వేలాదిమంది భక్తులు చేరుకోవడంతో వేములవాడ కిట కిటలాడింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా దాదాపు లక్షకు పైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాల యంలో తొలిసారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరు గుతున్నాయి. ఇందులో భాగంగా భాగంగా మొదటిరోజున స్వామివారికి లక్ష్మిగణపతి పూజ, ప్రాతఃకాల పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వరంగల్ ప్రాంతం నుంచి భక్తులు తక్కువగా వస్తున్నారు. గత సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగానే వచ్చి వెళ్లారు. ప్రస్తుతం నిజామా బాద్, అదిలాబాద్, హైద్రాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా చేరుకున్నారు.
భక్తులకు లఘు దర్శనం, కోడె మొక్కులు..
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం సాయం త్రం నుంచి భక్తుల లఘుదర్శనం ప్రారంభమైంది. 48గంట ల పాటు భక్తులకు లఘు దర్శనం సౌకర్యం కొనసాగుతుం ది. మరోవైపు కోడె మొక్కులు కొనసాగాయి. కోడె మొక్కుల కోసం దాదాపు 150 కోడెలను మూడు షిఫ్టుల్లో తిప్పేందుకు సిద్ధంగా ఉంచారు. కోడెలు ఆలసిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కోడె మొక్కుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు ఇస్తున్నారు. ప్రధా నంగా వీఐపీలు, శివదీక్షస్వాములు, పట్టణ ప్రజలు, అధికా రుల కోసం ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటుచేసి దర్శనానికి అనుమతి ఇచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఆర్జిత సేవలను నిలిపివేశారు. సోమవారం ఉద యం ప్రాతఃకాల పూజ అనంతరం భక్తుల మొక్కుల ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.
నేడు శివస్వాముల దీక్షల విరమణ
మహాశివరాత్రి పర్వదినమైన స్వామి వారి సేవలో దీక్షలు చేపట్టిన శివస్వాములు ఆదివారం సా యంత్రం 6గంటలకు దీక్ష లు విరమిస్తారు. ఈ సందర్భంగా వేముల వాడ, సిరిసిల్ల, ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 5వేల మంది భక్తులు శివ దీక్షలు చేపట్టారు. వీరంతా 11, 21, 41మండల దీక్షలు చేపట్టిన శివస్వాములు సాయంసంధ్యావేళల్లో విరమిస్తారు. వేముల వాడ పురవీధుల్లో ఊరేగింపుగా డప్పుచప్పుళ్లతో దేవస్థానాని కి చేరుకుంటారు. వీరికి సాయంత్రం 6.30గంటలకు దేవస్థా నంలో స్వామివారి దర్శనానికి ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవాలయం చెరువుకట్ట వరకు భక్తుల రవాణా కోసం ఉచిత ఆర్టీసీ బస్సులను సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కే.ఎస్. శ్రీనివాస్ రాజ్ ప్రారంభించారు. ప్రతి రోజు 10 ఉచిత బస్సులు 200 ట్రిప్పులు నడిపిస్తారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఈవో రమాదేవి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, డిపో మేనేజర్ శ్రీని వాస్‌లు పాల్గొన్నారు. కాగా, మహాశివరాత్రి జాతర సంద ర్భంగా భక్తుల కోసం లక్ష్మిగణపతి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసి న అన్నదాన కార్యక్రమాన్ని శనివారం ఆలయ ఈవో రమా దేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ లు ప్రారంభించారు. ప్రతిరోజు రెండు పూటలు అన్నదానం చేస్తారు. దాదాపు 25వేల మంది భక్తులు భోజనం చేయ డానికి ఏర్పాట్లు చేశారు.