Raajanna siricilla {వానాకాలం ‘సాగు’ ఖరారు
ABN , Publish Date - May 16 , 2026 | 12:33 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) యాసంగి ధాన్యం విక్రయించడం.. వరికోతలపై దృష్టి సారిస్తూనే వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
- జిల్లాలో పంటల యాక్షన్ ప్లాన్ సిద్ధం
- 2.48507 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా
- వరి 1.91 లక్షల ఎకరాలు, పత్తి 46,892 ఎకరాలు
- 57,399 మెట్రిక్‌టన్నుల ఎరువుల వినియోగం
- అన్నదాతకు ముందే ఎరువుల ఽభారం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి ధాన్యం విక్రయించడం.. వరికోతలపై దృష్టి సారిస్తూనే వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కోతలు పూర్తయిన భూముల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. వర్షాలపై ఆశలతో ఖరీఫ్ సాగు పెంచుకున్నారు. దీనికి అనుగుణంగానే ఖరీప్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టారు.
వానాకాలం సాగు 2.48 లక్షల ఎకరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91వేల 366 ఎకరాలు, పత్తి 47,120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3,430 ఎకరాలు, ఇతర పంటలు 5,593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 1,23,790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, ఎరువులు 57,399 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,944మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,760 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,710మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,225 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.
రైతులపై దాదాపు రూ.10 కోట్ల భారం
అన్నదాతకు వానాకాలం పంటల సాగు ముందే ఎరువుల భారం పడింది. గడిచిన ఏడాది కాలంగా నాలుగుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. యాసంగిలో రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. వానాకాలం సాగుకు సిద్ధమయ్యే రైతులకు ఎరువుల భారం ముందుకు వచ్చింది. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు ధరలు పెరగడంతో పాటు, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా రవాణా చార్జీల పెరుగుదల ఎరువులపై ప్రభావం పడింది. ఎరువుల కంపెనీలు ఎరువు ధరలు పెంచాల్సి వస్తుందని ప్రకటిస్తున్నాయి. గత ఏడాది జూలైలో వివిధ ఎరువుల బస్తాలపై ఒక్కో బస్తాపై రూ 50 నుంచి 330 వరకు పెరిగింది. అదే క్రమంలో నవంబర్‌లో రూ 50 నుంచి రూ 100 వరకు, జనవరిలో యాసంగికి ముందే రూ 50 వరకు పెంచారు. ప్రస్తుతం కాంప్లెక్స్, పొటాష్ చెరువులపై రూ.225 నుంచి రూ.300 వరకు ధరలు పెరిగాయి. పెరిగిన కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల ధరలతో జిల్లా రైతులపై అదనంగా వానాకాలం సీజన్లో రూ 10 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం పెరిగిన ఎరువులు ధరల్లో 20:20:0:13 ఎరువుల బస్తాపై రూ300 వరకు పెరిగింది. పాత ధర రూ 1500 ఉండగా ప్రస్తుతం రూ 1800 చేరింది. 19:19:19 ఎరువులపై రూ 225 పెరిగింది. పాత ధర రూ 2075 ఉండగా కొత్త ధర రూ 2300 పెరిగింది. 12:32:16 బస్తాపై రూ 225 పెరుగగా పాత ధర రూ 2025 నుంచి రూ 2250 చేరింది. 14:35:14 ఎరువు ధర కూడా రూ 2175 నుంచి రూ 2250 పెరిగింది. పొటాష్ మాత్రం రూ 125 పెరిగింది. పాత ధర రూ 1850 ఉండగా కొత్త ధర రూ.1975కు చేరింది. డీఏపీ బస్తా రూ 1350, యూరియా బస్తా రూ 266.50 ఇస్తున్నారు. వీటిపై కూడా ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది. యాసంగి సీజన్‌తో పోలిస్తే వానకాలం సీజన్లో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు నాలుగు బస్తాల వరకు, రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అరబస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. దీంతో వానాకాలం సీజన్‌లో ఎరువుల భారంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
128 పంటలకు స్వల్పంగా రుణ పరిమితి పెంపు
వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే పంట రుణాల పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయం మేరకు 2026-27 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన 128 పంటలకు సంబంధించి రుణ పరిమితిని పెంచారు. గతేడాదితో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో కొన్ని పంటలకు మాత్రమే స్వల్పంగా పరిమితి పెరిగింది.
వరి, పత్తికి రూ 2 వేలు, మొక్కజొన్నకు రూ 3 వేలు పెంచారు. గత సంవత్సరం వరికి ఎకరానికి రూ 46 వేల పరిమితిని రూ 48 వేలకు పెంచింది. పత్తి 50 వేలు ఉండగా రూ 52 వేలు పెరిగింది. గత సంవత్సరం రుణాలు ఇవ్వని వివిధ రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్న పత్తి సాగు చేసే రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించలేదు. ఈసారి ఎకరానికి రూ 52 వేల చొప్పున బ్యాంకులో రుణాలు ఇవ్వనున్నారు. విత్తన వరి పంటకు ఎకరానికి రూ 45 వేలు, చిల్లీస్ రూ లక్ష, పుదీనా రూ 35 వేలు అంటుకట్టిన కూరగాయలు ఎకరానికి రూ 70వేలు, మల్బరీకి రూ 64 వేలు, స్వీట్‌జొన్నకు రూ.24 వేల చొప్పున రుణాలు ఇవ్వనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా, 2.47 ఎకరాకలకు సంబంధించి 81,416 ఎకరాలు 75,931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధిచి 25,092 మంది రైతుల వద్ద 86,460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8,346 మంది రైతుల వద్ద 53,560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1,427 మంది రైతుల వద్ద 18,962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2756 ఎకరాల భూములు ఉన్నాయి. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు రుణ పరిమితి రైతులను నిరాశపరిచింది. ఎకరానికి వెయ్యి మాత్రమే పెంచారు. ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి రూ 48 వేల నుంచి రూ 50 వేల వరకు రుణ పరిమితి ఐదేళ్ల వరకు నిర్ణయించారు. చిల్లీస్ కు సంబంధించి రూ 86 వేల నుంచి రూ 90 వేల వరకు, మల్చింగ్ సంబంధించి రూ లక్ష, టమాట రూ 57 వేల నుంచి రూ 58 వేల వరకు నిర్ణయించారు. ములక్కాడ రూ 36 వేల నుంచి రూ 40 వేలకు, అల్లం రూ.71 వేల నుంచి రూ72 వేలకు, వెల్లుల్లి రూ.40 వేల నుంచి రూ 41 వేలకు పెరిగింది.
జిల్లాలో ఖరీఫ్ సాగు లెక్కలు
మండలం వరి పత్తి ఇతర మొత్తం
గంభీరావుపేట 19,200 150 521 19,871
ఇల్లంతకుంట 23,800 12,800 1,638 38,238
ముస్తాబాద్ 25,000 650 1,229 26,879
సిరిసిల్ల 4,600 750 97 5,447
తంగళ్లపల్లి 21,600 1,300 1,152 24,052
వీర్నపల్లి 8,096 200 00 8,296
ఎల్లారెడ్డిపేట 18,600 3,300 14 21,914
బోయినపల్లి 13,000 7,000 1,260 21,260
చందుర్తి 15,600 5,500 412 21,512
కోనరావుపేట 19,200 4,400 587 24,187
రుద్రంగి 6,180 1,820 2,287 10,287
వేములవాడ 5,440 5,050 452 10,942
వేములవాడ రూరల్ 11,050 4,200 372 15,622
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,91,366 47,120 10,021 2,48,507
-----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో ఖరీఫ్ సాగుకు కావాల్సిన విత్తనాలు
మండలం వరి(క్విటాళ్లు) పత్తి (ప్యాకెట్లు)
గంభీరావుపేట 5,630 600
ఇల్లంతకుంట 7,450 37,540
ముస్తాబాద్ 7,500 1,500
సిరిసిల్ల 1,200 2,650
తంగళ్లపల్లి 6,600 3,000
వీర్నపల్లి 2,049 400
ఎల్లారెడ్డిపేట 5,500 10,500
బోయినపల్లి 2,600 14,000
చందుర్తి 4,560 18,600
కోనరావుపేట 7,200 2,600
రుద్రంగి 1,780 10,200
వేములవాడ 1,920 13,200
వేములవాడ రూరల్ 2,800 9,000
---------------------------------------------------------------------------------------
మొత్తం 56,789 1,23,790
---------------------------------------------------------------------------------------
జిల్లాలో ఖరీఫ్ సాగుకు కావాల్సిన ఎరువులు(మెట్రిక్‌టన్నులు)
మండలం యూరియ డీఎపీ ఎన్‌పీకేఎస్ ఎంవోపీ ఎస్‌ఎస్‌పీ
గంభీరావుపేట 2,200 200 1,700 450 80
ఇల్లంతకుంట 3,950 400 3,600 600 120
ముస్తాబాద్ 2,900 400 2,600 250 50
సిరిసిల్ల 650 60 550 100 20
తంగళ్లపల్లి 2,100 280 2,100 460 80
వీర్నపల్లి 1,024 90 860 150 25
ఎల్లారెడ్డిపేట 2,200 700 1,800 550 100
బోయినపల్లి 2,500 750 2,200 400 50
చందుర్తి 2,200 210 2,100 330 70
కోనరావుపేట 2,500 310 1,700 400 70
రుద్రంగి 1,120 110 1,080 155 30
వేములవాడ 1,040 110 1,020 140 25
వేములవాడ రూరల్ 1,560 140 1,400 240 40
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 25,944 3,760 22,710 4,225 760
-----------------------------------------------------------------------------------------------------