Share News

Raajanna siricilla : నేతన్నలకు మెగా టెక్స్‌టైల్‌ ఆశలు

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:47 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెలు, లెక్కలు సామా న్యులకు అర్థం కాకపోయినా బడ్జెట్‌ మోదం.. ఖేధం అన్నట్లుగానే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు ఎదురు చూస్తున్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, క్లస్టర్‌ ఆశలు తీరుతాయని భావిస్తున్నారు.

Raajanna siricilla : నేతన్నలకు మెగా టెక్స్‌టైల్‌ ఆశలు

- కేంద్ర బడ్జెట్‌లో జౌళి రంగానికి చేయూత

- వచ్చే ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి

- జిల్లాకు బాలికల వసతిగృహం

- దివ్యాంగులకు చేయూతగా రెండు పథకాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెలు, లెక్కలు సామా న్యులకు అర్థం కాకపోయినా బడ్జెట్‌ మోదం.. ఖేధం అన్నట్లుగానే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు ఎదురు చూస్తున్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, క్లస్టర్‌ ఆశలు తీరుతాయని భావిస్తున్నారు. బడ్జెట్లో టెక్స్‌టైల్‌ రంగానికి భారీగా చేయూతనిస్తూ ప్రతిపాదించిన పథకాలు వస్త్రోత్పత్తిదారుల్లో ఆశలు పెంచింది. టెక్స్‌టైల్‌ రంగం సామర్థ్యాన్ని, బలోపేతం చేయడంతో పాటు మెగా టెక్స్‌ టైల్‌ పార్కులు చాలెంజ్‌ మోడ్‌లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2013-2014 కేంద్ర బడ్జెట్‌ నుంచి సిరిసిల్ల నేతన్నలు మెగా పవర్లూమ్‌ క్లస్టర్‌ వస్తుందని ఎదురుచూస్తూ వస్తున్నారు. 2026-2027 బడ్జెట్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు, నేత కార్మికుల నైపుణ్య అభివృద్ధికి సమర్థ 2.0 పథకాన్ని మరింత సమర్థవంతంగా అందించే విధంగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గ్రామ్‌ స్వరాజ్‌ పథకం ద్వారా ఖాదీ, హ్యాండ్లూమ్‌ రంగాలను ప్రోత్సహించే విధంగా కొత్త పథకం ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో టెక్స్‌టైల్‌ రంగానికి రూ 10 వేల కోట్లు ఖర్చు చేయనట్లు తెలిపారు. జౌళి రంగానికి ఇవ్వనున్న చేయూతలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకుమేరకు వాటా లభిస్తుందని సందిగ్ధంలో నేత కార్మికులు ఉన్నారు. నేత కార్మికులు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివే యాలని ఎప్పటి నుంచో కోరుతున్న ఈసారి కూడా మోక్షం కలగలేదు.

దివ్యాంగులకు.. మహిళలు చేయూత

దివ్యాంగులకు చేయూతనిచ్చే దిశగా కేంద్రం రెండు కొత్త పథకాలను ముందుకు తీసుకొచ్చింది. దివ్యాంజన్‌ కౌశల్‌ యోజన, దివ్యాంగ్‌ సహకార యోజన ద్వారా చేయూతనిచ్చే కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా జిల్లాలోని దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మహిళకు చేయూతనిస్తూ ప్రత్యేకంగా షీ బజార్‌ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయబోతుందని ప్రకటించింది. కొబ్బరి, గంధం చెట్ల పెంపకానికి రైతులకు ప్రోత్సాహం ప్రకటించినా సాధారణంగా పండించే పంటలపై రైతుల్లో అయోమయం నెలకొంది.

నిరాశ.. ఊరట

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకాలు, కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించిన బడ్జెట్‌ కొంత నిరాశ.. మరికొంత ఊరటగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వేతన జీవులకు బడ్జెట్లో నిరాశ కలిగింది. కొత్తగా పన్ను మినహాయింపులను ప్రతిపాదించక పోయిన విధానపరమైన అంశాల్లో ఊరట లభించింది. పన్నుల చెల్లింపుల శ్లాబులు యధావిధిగా ఉంచారు. ఐటీ రిటర్న్‌లో డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31 వరకు గడువు పొడిగించారు. రిటర్న్‌లోని లోపాలు సరి చేసుకోవడానికి అదనంగా మూడు నెలల సమయం లభించింది. చిన్నపన్ను చెల్లింపుదారులకు లోయర్‌ నిల్‌ టాక్స్‌ డిడక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. రూల్‌ బెస్ట్‌ ఆటోమేటెడ్‌ ప్రాసెస్‌ ద్వారా అర్హులైన వారు నేరుగా ఈ సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో బాలికల వసతి గృహాన్ని నిర్మించే విధంగా బడ్జెట్‌లో పొందపరిచారు. ఖేల్‌ ఇండియా మిషన్‌ ద్వారా క్రీడాభివృద్ధి ప్రకటించారు. క్యాన్సర్‌, డయాబెటిక్‌ మందులు, సోలార్‌ ప్యానల్‌, విదేశీ విద్య, మైక్రో ఓవెన్‌, విదేశీయాత్రలపై పన్నులు తగ్గుతాయి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుంది. తెల్లంగాణకు ప్రత్యేక పద్దులు ప్రస్తావించకపోవడంతో వివిధ వర్గాల నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Feb 02 , 2026 | 01:47 AM