Raajanna siricilla : రైతు భరోసాపై ఆశలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:35 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో
- ఈనెల 30న రైతు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం
- జులై 5 తేదీవరకు దరఖాస్తులకు కొత్త పట్టాదారులకు అవకాశం
- ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయించారు. యాసంగి సీజన్‌లో రెండు ఎకరాలకే భరోసా సాయానికి బ్రేక్ వేశారు. యాసంగి సీజన్ ముగిసిపోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒకే విడతలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అనే సందేహం కూడా రైతుల్లో నెలకొంది. రైతు భరోసా పథకంలో స్వల్ప మార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రైతులకు ఉన్న భూమి మొత్తానికి రైతు భరోసా ఇస్తారా.. లేక కటాఫ్ పెడతారా అనే సందిగ్ధం ఏర్పడింది. ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇస్తారన్న చర్చ కూడా ఉంది. చిన్న, సన్నకారు రైతులకు మాత్రం పూర్తిస్థాయిలోనే రైతు భరోసా అందుతుందన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
గత వానకాలం సీజన్‌లో రూ 248.57 కోట్ల సాయం..
ప్రస్తుత వానకాలం సీజన్ ఆరంభంలోనే రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గత వానకాలం సీజన్‌లో 1.26 లక్షల మంది రైతులకు 248.57 కోట్ల రూపాయలను అందించారు. ప్రస్తుతం ముగిసిన యాసంగి సీజన్‌లో మాత్రం రెండెకరాలకు పరిమితం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. దీంతోపాటు కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు కొద్ది మేరకే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే భూములు దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఉండగా వరి నాట్లు జోరందుకోలేదు. మరోవైపు పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈక్రమంలో రైతు భరోసా నిధులు రైతులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వానాకాలం సీజన్ రైతుభరోసా ఒకే విడతలో అందించే యోచనలో ఉంది.
కొత్త పట్టాదారులకు అవకాశం
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పొందిన రైతులు భరోసా పథకానికి జూలై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15వ తేదీలోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లతో దరఖాస్తును వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరనున్నది.
యాసంగిలో రెండు విడతల్లో..
యాసంగి సీజన్‌లో రైతులకు రెండెకరాల వరకే రైతు భరోసా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో నిధులు జమ చేశారు. జిల్లాలో 175 రెవెన్యూ గ్రామాల్లో యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్న క్రమంలో మార్చిలో మొదటి విడతలో 1,41,415 మంది రైతులకు రూ 68 కోట్ల 23 లక్షల 1211 రైతు భరోసా సాయం నిధులు జమ చేశారు. రెండు విడతల్లో 1.41 లక్షల మంది రైతులకు రూ 154 కోట్ల 34 లక్షల 40 వేల 221 భరోసా సాయం నిధులు జమ చేశారు. ఇందులో 23,478 మంది ఎస్సీ రైతులకు రూ. 18.766 కోట్లు, 8,106మంది ఎస్టీ రైతులకు రూ 8.62 కోట్లు, 1,09,831 మంది రైతులకు రూ 126.95 కోట్ల రూపాయలను జమ చేశారు. మొదటి విడతలో జిల్లాలోని 1.41లక్షల మంది రైతుల ఖాతల్లో రూ 68 కోట్ల 23 లక్షల 1211 భరోసా సాయం జమ చేశారు. ఇందులో 23,478 మంది ఎస్సీ రైతులకు రూ 10.66 కోట్లు, 8,106 మంది ఎస్టీ రైతులకు రూ 4.20 కోట్లు, 1,09,831 మంది రైతులకు రూ 53.35 కోట్ల భరోసా డబ్బులు జమ కానున్నాయి. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో జిల్లా రైతుల ఖాతాల్లో రూ 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు రూ. 80 కోట్ల 30 లక్షల 22,455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 1,26,278 మంది రైతులకు 2,48,857.15 ఎకరాలకు సంబంధించి రూ. 149కోట్ల 27 లక్షల 47573 రైతుల ఖాతాలో చేశారు. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు రూ. 80 కోట్ల 30 లక్షల 22455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 1,26,278 మంది రైతులకు 2,48,857.15 ఎకరాలకు సంబంధించి రూ. 149 కోట్ల 27 లక్షల 47573 రైతుల ఖాతాలో చేశారు.
2.43 లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధం
వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయనున్నారు. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47,120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3,430 ఎకరాలు, ఇతర పంటలు 5,593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56,789 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 1,23,790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఎరువులు 57399 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,944మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,760 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,710మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,225 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.
మండలాల వారీగా రెండు విడతల్లో యాసంగి రైతు భరోసా
మండలం రెవెన్యూ గ్రామాలు రైతులు వచ్చిన డబ్బులు(రూ.)
గంభీరావుపేట 18 13,532 12,93,85,705
ఇల్లంతకుంట 21 18,847 23,32,76,722
ముస్తాబాద్ 16 15,511 17,76,92,917
సిరిసిల్ల 05 5,135 3,80,68,604
తంగళ్ళపల్లి 16 14,193 14,99,77,030
వీర్నపల్లి 08 4,670 4,54,23,951
ఎల్లారెడ్డిపేట్ 17 13,416 13,74,79,792
బోయిన్‌పల్లి 16 11,492 13,08,69,829
చందుర్తి 11 10,906 13,27,55,160
కోనరావుపేట 21 13,594 15,32,34,606
రుద్రంగి 03 3,956 5,15,58,008
వేములవాడ 08 7,555 6,70,27,240
వేములవాడ రూరల్ 15 8,608 9,66,90,657
----------------------------------------------------------------------------------------------
మొత్తం 175 1,41,415 154,34,40,221
--------------------------------------------------------------------------------------------------