Share News

Raajanna siricilla : ఆధార్‌ అనుసంధానం పూర్తి..

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:00 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చేపట్టిన రేషన్‌ కార్డుల ఆధార్‌ అనుసంధానం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద శాతం పూర్తి చేశారు.

Raajanna siricilla :  ఆధార్‌ అనుసంధానం పూర్తి..

- రేషన్‌ కార్డులకు వంద శాతం ఆధార్‌ లింక్‌

- పూర్తికాని బ్యాంకు ఖాతాలు, ఫోన్‌ నంబర్ల సీడింగ్‌

- త్వరలో ప్రత్యేక కార్యాచరణ..

- జిల్లాలో 1,95,753 రేషన్‌ కార్డులు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చేపట్టిన రేషన్‌ కార్డుల ఆధార్‌ అనుసంధానం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద శాతం పూర్తి చేశారు. బ్యాంకు ఖాతాల సీడింగ్‌పై లబ్ధిదారులు అనాసక్తి చూపుతున్నారు. ఫోన్‌ నంబర్ల అనుసంధానం చివరి దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా ఫోన్‌ నంబర్ల సీడింగ్‌ పూర్తి కావడంతో మిగిలిన బ్యాంక్‌ ఖాతాల సీడింగ్‌, ఫోన్‌ నంబర్ల అనుసంధానంపై ప్రభుత్వం త్వరలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. రేషన్‌ కార్డులకు ఫోన్‌ నంబర్ల అనుసంధానం పూర్తయితే లబ్ధిదారులకు అవసరమైన సమాచారాన్ని నేరుగా అందిస్తారు. జిల్లాలో 1,95,753 రేషన్‌ కార్డులు ఉండగా, 5,75,778 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో రేషన్‌ కార్డులకు 100 శాతం ఆధార్‌ అనుసంధానం చేశారు. లబ్ధిదారుల అనుసంధానంలో 1,95,7573 పూర్తిచేశారు. బ్యాంకు ఖాతాల సీడింగ్‌లో మాత్రం 1,95,753 కార్డులో గాను 1,41,111 అనుసంధానం జరిగింది. ఫోన్‌ నంబర్లు అనుసంధానంలో 1,93,837 కార్డులకు పూర్తిచేశారు. ఆధార్‌ అనుసంధానం రేషన్‌ డీలర్ల ద్వారానే పూర్తి చేశారు. ఈ-పాస్‌ యంత్రాల ద్వారా కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి ఆధార్‌ నంబర్‌తో వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ చేసుకున్నారు. మిగిలిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెలాఖరు వరకు మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ

భగ్గుమంటున్న ఎండల్లో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్‌ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం పంపణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి ఈనెల 30వ తేది వరకు పంపిణీ కొనసాగిస్తారు. జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీ కోసం 11,172.165 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. జిల్లాలో జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉండగా, 1,95,554 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిపరిధిలో 5,75,463 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 1,81,526 ఉండగా లబ్ధిదారులు, 5,39,675 మంది, అంత్యోదయ కార్డులు 13,829 ఉండగా, లబ్ధిదారులు 35,583 మంది ఉన్నారు. అన్నపూర్ణ కార్డులు 199 ఉండగా 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు ప్రతినెల ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్న బియ్యం ఈసారి మూడు నెలల కోటాగా ఇస్తున్నారు. దీంతోపాటు గతంలో రేషన్‌ లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించే దిశగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్ల పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేశారు. ప్రస్తుతం గోదాముల్లో నిలువ ఉన్న మేరకు సరఫరా చేసి తర్వాత రెగ్యులర్‌ సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేస్తారు. 2021 సంవత్సరంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద ప్రజలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యంలో ఒక శాతం పోషకాలు కలపాలని నిర్ణయించారు. దీంతో ఒక క్వింటాల్‌ బియ్యంలో ఒక కిలో ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఉంటాయి. ఒక శాతం ఎఫ్‌ఆర్‌కే కలపడానికి జిల్లాలో 130 రైస్‌మిల్లులు ఉండగా, దాదాపు అన్ని మిల్లుల్లో రూ.10లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేసి ఎఫ్‌ఆర్‌కే మిషనరీలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్‌ లబ్ధిదారులతోపాటు అంగన్‌వాడీ, హాస్టల్లో, రెసిడెన్షియల్‌ పాఠశాలకు ఎఫ్‌ఆర్‌కే బియ్యమే వాడుతున్నారు. ఎప్పటికే బియ్యం సరఫరాలో నాణ్యత లేకపోవడం, ప్లాస్టిక్‌ బియ్యమని, పిండితో కల్తీ చేశారని రకరకాల ప్రచారంతో అపోహలు వచ్చాయి. అంతేకాకుండా ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఎక్కువ రోజులు గోదాంలో నిల్వ ఉండడం వల్ల పోషకాలు అనుకున్నంత మేరకు పోషకాలు ఉండడం లేదనే కారణంగానే బియ్యం నిలిపివేస్తున్నట్లు తెలిసింది.

మండలాల వారీగా ఆధార్‌ అనుసంధానం, బ్యాంకు ఖాతాల సీడింగ్‌ వివరాలు

మండలం రేషన్‌ కార్డులు ఆధార్‌ బ్యాంకు ఖాతా

బోయిన్‌పల్లి 13,284 13,284 10,927

చందుర్తి 12,196 12,196 9,407

ఇల్లంతకుంట 17,352 17,352 13,839

గంభీరావుపేట 15,855 15,855 12,294

కోనరావుపేట 15,649 15,649 11,646

ముస్తాబాద్‌ 16,620 16,620 12,164

రుద్రంగి 5,510 5,510 2,737

సిరిసిల్ల 30,398 30,398 19,535

తంగళ్ళపల్లి 16,059 16,059 10,745

వీర్నపల్లి 4,799 4,799 3,624

వేములవాడ రూరల్‌ 8,441 8,441 5,914

వేములవాడ 22,070 22,070 5,914

ఎల్లారెడ్డిపేట 17,520 17,520 13,239

మొత్తం 1,95,753 1,95,753 1,41,111

-------------------------------------------------------------------------------------

జిల్లాలో మూడు నెలల రేషన్‌ బియ్యం కోటా

మండలం లబ్ధిదారులు బియ్యం(కిలోలు)

బోయిన్‌పల్లి 37,591 7,20,372

చందుర్తి 35,264 6,59,103

గంబీరావుపేట 46,291 9,33,084

ఇల్లంతకుంట 49,345 8,74,827

కోనరావుపేట 46,121 8,73,954

ముస్తాబాద్‌ 49,195 9,32,016

రుద్రంగి 17,470 3,29,697

సిరిసిల్ల 91,418 19,97,955

తంగళ్లపల్లి 46,281 9,10,677

వీర్నపల్లి 15,037 2,83,506

వేములవాడ 66,176 4,53,294

వేములవాడ రూరల్‌ 24,209 12,43,920

ఎల్లారెడ్డిపేట 51,065 9,59,760

మొత్తం 5,75,463 111,72,165

Updated Date - Apr 27 , 2026 | 01:00 AM