అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:16 AM
నగరంలో వివిధ పథకాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నగరంలో వివిధ పథకాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశించారు. శనివారం నగరంలోని 49వ డివిజన్ సంతోష్‌నగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, నిర్దేశిత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం సంతోషీమాతా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, కార్పొరేటర్ ఎన్నం లక్ష్మిప్రకాశ్ పాల్గొన్నారు.