ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:35 PM
ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కరీంనగర్ త్రీ టౌన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. స్టేషన్‌లోని పలు విభాగాలను, రికార్డులను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని అన్ని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉపయోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ తిరుమల్, ఎస్‌ఐ చేరాలు, సిబ్బంది పాల్గొన్నారు.