Share News

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి..

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:33 PM

వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీరామ్‌ అన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి..
ఇల్లందకుంట పీహెచ్‌సీలో వైద్యాధికారితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీరామ్‌

ఇల్లందకుంట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీరామ్‌ అన్నారు. మంగళవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసి ఫీవర్‌ సర్వే, వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. టీహబ్‌కు ఫీవర్‌ శాంపిల్స్‌ను రెగ్యులర్‌గా పంపించాలన్నారు. పాము, కుక్క కాటుకు సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ వేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మధు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:33 PM