నాణ్యమైన సమాచారం సేకరించాలి..
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:51 PM
ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జనగణన-2027కు సంబంధించిన సన్నాహక కార్యక్ర మాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్ బుక్ ఫీల్డ్ ఫంక్షనరీలకు నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ పర్యవేక్షించి మాట్లాడారు. డీసీహెచ్‌సీ బీపోర్టల్, మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి విలేజ్ డైరెక్టరీ, టౌన్ డైరెక్టరీ సమాచారాన్ని ఖచ్చితంగా సమయానుకూలంగా నాణ్యతతో సేకరించాలని ఆదేశించారు. అలాగే విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 31-12-2025ను ప్రామాణిక తేదీగా తీసుకుని రెవెన్యూ గ్రామాల వారీగా మొబైల్ అప్లికేషన్‌తో పంచాయతీ కార్యదర్శులు చార్జ్ అఫీసర్ల పర్యవేక్షణలో సేకరించాలని ఆదేశించారు. ఈ సమాచార సేకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 8వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విలేజీ డైరెక్టరీలో విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు. పారిశుధ్యం, రవాణా, కమ్యూ నికేషన్, బ్యాకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ చేతివృత్తులు, అలాగే గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలను, పరిశీలనలు వంటి తొమ్మిది ప్రధాన అంశాలకు సంబంధించిన సమచారాన్ని, టౌన్ డైరెక్టరీ షెడ్యూల్‌ను ఛార్జ్ అఫీసర్‌లు నియమించిన అధికారులతో పట్టణ పౌర పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయా లని ఆదేశించారు. ఈ శిక్షణలో జిల్లా జనగణన అధికారి ముఖ్య ప్రణాళిక అధికా రి పీబీ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.