నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:00 AM
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఖరీఫ్ పంట దిగు బడులు కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
సిరిసిల్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఖరీఫ్ పంట దిగు బడులు కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం, పత్తి కొనుగో ళ్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 115, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 108, మెప్మా ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ధాన్యం సేకరణకు ఇప్పటికే 26 రైస్‌మిల్లులు, అలాగే ప్రభుత్వ ప్రత్యామ్నాయ గోదాములు సిద్ధంగా పెట్టామ ని పౌర సరఫరాల శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈసందర్బంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం శుభ్రం చేసి 17శాతం తేమ ఉండేలా చూసుకో వాలని సూచించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపుని చ్చారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధంగా పెట్టాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికా రి అఫ్జల్‌బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి తనూజా, మేనేజర్ గోపాల్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.