పారదర్శక దర్యాప్తుతో నిందితులకు శిక్షలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:25 AM
జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులను పారదర్శకంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులను పారదర్శకంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశంను నిర్వహించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, నాన్ బెయిలబుల్ వారంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరు తదితర అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తులో జాప్యానికి గల కారాణాలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకా లంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అవసరమైతే న్యాయ సలహాలు తీసు కొని దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రతిరోజు పర్యవేక్షణ నిర్వహించి నిందితుల అరెస్టులో నిర్లక్ష్యానికి తావివ్వవదని స్పష్టం చేశారు. పోలీ సుల ప్రవర్తనే శాఖ ప్రతిష్టను నిర్ణయింస్తుందని విధుల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్వహరించాలని ప్రతి సీఐ, ఎస్ తమ పరిధిలో స్థానిక ఇంటలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలతో సత్సం బంధాలు కొనసాగిస్తూ పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందించేల పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివా సులు, వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, రమాకాంత్, రమేష్, రామ్మోహన్, ప్రేమనందం, మోతి రాం, సిబ్బంది పాల్గొన్నారు.