ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:37 AM
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలంలోని కొత్తపేట గ్రామం లో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్ర వాల్‌తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 567 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా దాదాపు ఐదు లక్షల మందికి చేయూత పెన్షన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశార ని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీతో పాటు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు లకు రూ.21వేల కోట్ల రుణమాఫీ వంటి పథకాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. బోయినపల్లి మండ లంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతు న్నాయని, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.12కోట్లతో స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చొప్ప దండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిది ద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఈనెల 19 నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెన్షన్ డబ్బులు జమ కానున్నాయని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 8209మందికి, బోయిన పల్లి మండలంలో 567 మందికి నూతన పెన్షన్లు మం జూరుచేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తిలో బోయినపల్లి మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రా లు అందజేస్తామని కలెక్టర్ తెలి పారు. ఇందిరమ్మ కుటుంబ జీవి త బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డు ల్లో నెలరోజుల పాటు దరఖాస్తు లు స్వీకరిస్తామని, రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేనివారు కూడా అర్హులని వివరించారు. ఇందుకోసం ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు సమ ర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ చేపడతామని తెలి పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ షరీఫోద్దీన్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, ఏవో ప్రణీత, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, సింగిల్‌విండో చైర్మన్లు జోగినపల్లి వెంకటరామారావు, వన్నెల మమతరమణరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కుస రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మనబో యిన సువిన్‌యాదవ్,నాయకులు నాగుల వంశీ, సర్పం చ్‌లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.