ప్రజా సేవే ప్రధాని మోదీ ప్రస్థానానికి స్ఫూర్తి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:57 PM
ప్రజా సేవే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రస్థానానికి స్ఫూర్తి అని భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సేవే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రస్థానానికి స్ఫూర్తి అని భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రస్థానం సంద ర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవాజ్యోతి యాత్రను జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సమక్షంలో నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ అమరవీరుల స్తూపం సమీపంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో ప్రధాని ప్రసంగాన్ని ముఖ్య అతిథి పెద్దిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సేవా జ్యోతి యాత్రను చేపట్టారు. రథంపై జ్యోతిని వెలిగించగా. నేతకార్మికుడు వెల్ది హరిప్రసాద్ కాగడాను వెలిగించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అందజేశారు. అనం తరం పాత బస్టాండ్ నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని ప్రజాజీవిత ప్రస్థానం దేశసేవ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో కొనసాగుతోం దన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. సేవా కార్యక్రమాలతో సమాజంలో సేవా భావాన్ని మరింతగా విస్తరించాల్సిన అవస రం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జీ గంగాడి మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, కుమ్మరి శంకర్, కౌడిపల్లి గోపాల్‌రెడ్డి, గరిపెల్లి ప్రభాకర్, సంటి మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, కరెడ్ల మధుకర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం లక్ష్మీ, సంతోష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు సంజీవరెడ్డి, సురేందర్ రావు, జిల్లా మీడియా ఇన్‌చార్జ్ కాసుగంటి రాజు, జిల్లా ఆఫీస్ ఇన్ చార్జ్ భాగయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్య క్షులు అన్నాడి జలపతిరెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, మహి ళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాజీ జడ్పీ టీసీ పల్లం అన్నపూర్ణ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ నాయక్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సాబీర్, ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, సెన్సార్ బోర్డు మెం బర్ వేముల వైశాలి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షు లు దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు.