Share News

23న కార్మికులతో బహిరంగ సభ

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:37 PM

తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్ర మకు ప్రధాన కేంద్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగస్టు 23న అఖిల భారత టెక్స్‌టైల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం, కార్మికులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.

23న కార్మికులతో బహిరంగ సభ

సిరిసిల్ల టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్ర మకు ప్రధాన కేంద్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగస్టు 23న అఖిల భారత టెక్స్‌టైల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం, కార్మికులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం బీవైనగర్‌ అమృత్‌లాల్‌ శుక్ల కార్మిక భవన్‌లో తెలం గాణ పవర్‌లూం వర్కిర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ అధ్యక్షతన యూనియన్‌ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఎం మాజీఎమ్మెల్సీ సీతారాములు, అఖిల భారత టెక్స్‌టైల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు కూరపాటి రమేష్‌ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీతారాములు, కూరపాటి రమేష్‌ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొట్ట మొదటి సారిగా ఆగస్టు 23న అఖిల భారత టెక్స్‌టైల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సమావేశం, బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నామన్నారు. వివిధ రా ష్ట్రాల్లో టెక్స్‌టైల్‌ పవర్‌లూం రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తునటువంటి నాయ కులు కమిటీ సమావేశం, బహిరంగ సభలో పాల్గొంటున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో టెక్స్‌టైల్‌, పవర్‌లూం వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొదటిసారిగా జరుగుతున్న జాతీయస్థాయి సమావేశం, బహి రంగ సభకు జిల్లాలోని పవర్‌లూం కార్మికులతోపాటు దాని అనుబంధ పరిశ్రమ లో కార్మికులు పాల్గొనాలన్నారు. జిల్లాలోని వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాము లు, యజమానులు, వాణిజ్య వ్యాపారస్థులు, ప్రజలు సహాయసహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిల్లా కార్యదర్శి సిరిమల్ల సత్యం పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:37 PM