ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:43 AM
ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
-కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, మెట్‌పెల్లి ఆర్డీఓ నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కులం నుంచి బహిష్కరించారు
-సంగీత, పవన్ దంపతులు
మేము కులాంతర వివాహం చేసుకున్నామని కులం నుంచి బహిష్కరించారు. మేము ఇరువురం 2023 ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాం. అప్పటి నుంచి కులం నుంచి బహిష్కరించారు. దీంతో అనేక అవమా నాలు ఎదుర్కొంటున్నాము. మాకు న్యాయం చేయాలి.
ప్రభుత్వ భూమిని కాపాడండి
-బాలకృష్ణ, సామాజిక కార్యకర్త
జగిత్యాల పట్టణంలో 138/ఆ సర్వే నంబర్‌లో కబ్జాకు గురైన 13.19 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి. గతంలో ఈ విషయమై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వడం వీలు కాదని సమాధానం ఇచ్చారు. ఈ స్థలంపై విచారణ కమిటీ వేసి నెల రోజులు దాటుతున్నా నివేదిక ఇవ్వలేదు. కమిటీ నివేదిక సమర్పించడంలో నిర్లక్ష్యంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.