Share News

ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:32 PM

ప్రజావాణిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.

ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

సుభాష్‌నగర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అఽధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. సిబ్బంది నిబంధనలు పాటిస్తూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిచంఇ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్తా, ఎనహెచఆర్‌సీతోపాటు కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెడ్‌క్రాస్‌ సేవలను విస్తరించేందుకు వరదలు, ఇతర విపత్తులు, ఆపదవేళ బాఽధితులకు సహాయం అందించేందుకు ఉద్యోగులు రెడ్‌క్రాస్‌ సొసైటీలో సభ్యత్వం పొందాలని కలెక్టర్‌ అన్నారు. ప్రజావాణిలో 188 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 11:32 PM