Share News

పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:18 AM

పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు.

పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి

వేములవాడ రూరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పేదల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు. వేములవాడ రూరల్‌ మండలం వట్టెంల గ్రామంలో ఓపెన్‌ జిమ్‌, 26లక్షలతో, సీసీ రోడ్ల నిర్మాణం, 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్‌, 10 లక్ష లతో మహిళా సమైక్య భవన నిర్మాణం, నమిలిగుండుపల్లి ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, 12 లక్షలతో అంగరన్‌వాడీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపేద కుటుంబానికి అండగా నిలుస్తు న్నాయని తెలిపారు. వట్టేముల గ్రామానికి ఇప్పటివరకు వివి ధ అబివృద్ధి పనులకు సుమారు 2కోట్లు నిధులు మంజూరు అయ్యాయి తెలిపారు. వట్టేముల చేక్కపల్లి రోడ్డును సకాలం లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇరు వైపులా సైడ్‌ డైన్రేజీల నిర్మాణం చేపడతామని, వట్టే ముల జంక్షన్‌ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మహిళలు సాధికారత సాధించే వరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిల దొక్కుకునేలా చర్యలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగా కోటి మంది మహిళ లను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు మూడుసార్లు మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తు న్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:18 AM