Share News

ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:17 AM

నిరుపేద కుటుంబాలకు ఆకలికి అలమటించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ సన్న బియ్యం అందిస్తున్నాయి. అయితే ఈ బియ్యం కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీ వరకు బియ్యాన్ని రైస్‌ మిల్లులకు కొందు డీలర్లు, అలాగే కొందరు బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి

- గుట్టుచప్పుడు కాకుండా తరలింపు

- మిల్లులపై కానరాని పర్యవేక్షణ

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబాలకు ఆకలికి అలమటించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ సన్న బియ్యం అందిస్తున్నాయి. అయితే ఈ బియ్యం కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీ వరకు బియ్యాన్ని రైస్‌ మిల్లులకు కొందు డీలర్లు, అలాగే కొందరు బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడంతో అక్రమాలు ఎక్కువవుతు న్నాయి కొందరు రైస్‌ మిల్లర్ల యజమానులే కొందరు డీలర్లను అక్రమాలకు పాల్పడేలా ప్రొత్సహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అయితే అక్రమంగా తరలించిన రేషన్‌బియ్యాన్ని ఎవరూ గుర్తించకుండా ముందుగానే మిల్లుల యజ మానులకు దళారులు చరవాణి ద్వారా సమాచారం ఇస్తారు. ఆటో, ఇతర వాహనాల్లో రేసన్‌బియ్యాన్ని గుర్తించకుండా ఇతర బ్యాగుల్లోకి మార్చి మిల్లులకు వెళ్లగానే అక్కడా ఎవ్వరూ గుర్తించకుండా బియ్యాన్ని ఆడించి సంచుల్లో మార్చి నిల్వ చేస్తున్నారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా తరులుతున్నా పౌరసరఫరాల, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీలు కనిపించడం లేదు. పంపిణీ చేసిన బియ్యాన్ని కొందరు డీలర్లు కిలోకు రూ.12 నుంచి 15వకు కార్డు దారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా రోజూ ఉదయం బైక్‌లపై వచ్చే వారు 18 రూపా యలకు కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకోవడమే కానీ వాటిని ఉపయోగించుకోవడం లేదు. ఆ బియ్యాన్ని దళారులకు, డీలర్లకు అప్పజెప్పుతున్నారు. ఈ బియ్యం గుట్టు చప్పుడు కాకుండా రైస్‌ మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం రేషన్‌ ద్వారా లబ్ధిదారులు పొందుతున్నారు. ఇప్పటికైనా రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సమచారం అందిస్తేనే తనిఖీలు

గన్నేరువరం : మండలంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ద్వారా పేదలకు అందించాల్సిన బియ్యం కొంతమంది అక్రమ వ్యాపారుల చేతుల్లో పడుతూ బ్లాక్‌ మార్కెట్‌కు చేరుతోంది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంతో బియ్యం వ్యాపా రులు జోరుగా అక్రమ రవాణా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గన్నేరువరం మండలంలో ఇటీవల గునుకుల కొండాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ముందస్తు సమాచారంతో సివిల్‌ సప్తై అధికారులు పట్టుకున్నారు. సమాచారం ఇస్తేనే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని లేదంటే పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నారని స్థానిక అధికారులకు సమాచార మిస్తే గోప్యత పాటించకుండా వారి పేర్లను బహిర్గతం చేస్తున్నారని, దీంతో జిల్లా అధికా రులకు సమాచారం అందిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 02:17 AM