సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలి
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:21 AM
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి) : సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓఆర్‌ఎస్, మలేరియా, డెంగ్యూ సంబంధిత ఆర్జీటీ కిట్ల నిల్వలను సరిచూసుకోవా లన్నారు. ప్రతి మంగళవారం డ్రైడేను ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్భిణీల నమోదు 12 వారా లలోపు చేయాలని, సాదారణ ప్రసవాలు పెరిగేలా వైద్యసిబ్బంది చూడాలన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ అర్హులైన బాలికలకు వేయించాలని పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న దంతవైద్యశాలను పరిశీలించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నమోదు కాలేదని గుర్తించి నోటీసు ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. సమావేశంలో మండల వైద్యాధికారిణి జీవన జ్యోతి, మహేష్, శ్రీకాంత్, జవహార్, శోభారాణిలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.