Share News

పీఎస్‌వోలు క్రమశిక్షణతో ఉండాలి

ABN , Publish Date - May 24 , 2026 | 12:00 AM

ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్‌వోలు, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని కరీంనగర్‌ ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌ ఆదేశించారు.

పీఎస్‌వోలు క్రమశిక్షణతో ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌

కరీంనగర్‌ క్రైం, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్‌వోలు, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని కరీంనగర్‌ ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌ ఆదేశించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని తన కార్యాలయంలో ఏఆర్‌ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రామాణిక విధానాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీఐపీల ప్రయాణ వివరాల్లో గోప్యతను పాటించాలని ఆదేశించారు. బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తితో పనిచేయాలని, ఈ విభాగంలో జరిగే చిన్న పొరపాటైనా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ రజినీకాంత్‌, ఆర్‌ఎస్‌ఐలు నీలవేణి రాజు, కార్తీక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:00 AM