రోగులకు ఉత్తమ సేవలు అందించాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:29 AM
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముం దుగా జిల్లా ప్రభుత్వ ప్రధానవైద్యశాల ఎదుట ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని కలె క్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుంచి పట్టణ ప్రధా న రహదారుల గుండా అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీచౌక్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధా న వైద్యశాల ఆవరణలో నిర్వహించిన అవగా హన సదస్సులో కలెక్టర్ గరిమఅగ్రవాల్ మాట్లా డారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలను చేసి ఉత్తమ సేవలందించా లని సూచించారు. రోగులకు మెరుగైన వైద్యసేవ ల కోసం అవసరమైతే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయాలని ఆదేశించారు. ఆరో గ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసు పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఎయిడ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కార్యక్రమా లను నిర్వహించాలన్నారు. ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం, మం దులు అందుబాటులో ఉన్నాయని ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రత్యే వైద్య సేవలు ఉన్నాయని, వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రేమలో పెద్దపరీక్షలు ఎదుర్కోవాలంటూ తెలం గాణ రాష్ట్ర ఏయిడ్స్ నియంత్రణ సంస్థ ముద్రిం చిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెం డెంట్ ప్రవీన్‌కుమార్, ప్రభుత్వ వైద్యులు, సిబ్బం ది, ఆశలు పాల్గొన్నారు.