Share News

అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:46 PM

వైద్యులు సిబ్బంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి
డీఎంహెచ్‌వోతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వైద్యులు సిబ్బంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని హుస్సేనీపురఅర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. వైద్యసేవల కోసం వచ్చిన వారితో కలెక్టర్‌ మాట్లాడడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలను పెంచేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, ఎంహెచ్‌ఎన్‌ పీడీ సనా, మెడికల్‌ ఆఫీసర్‌ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

ఫ అవగాహనా ర్యాలీ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే ముఖ్యఅతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఉమాశ్రీ, డీఐవో డాక్టర్‌ సాజిద, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజగోపాల్‌, సనజవేరియా, డెమో శ్రీనివాస్‌, ఏవో రాజగోపాల్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కైక, డీపీఎం స్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:46 PM