Share News

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:23 AM

విద్యార్థులకు ఉన్నత ప్రమాణా లతో కూడిన విద్య అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఉపాధ్యాయు లను సిబ్బందిని ఆదేశించారు.

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలి
విద్యార్థిని నోట్‌బుక్కు పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మల్యాల, జనవరి 9(ఆంధ్రజ్యో తి): విద్యార్థులకు ఉన్నత ప్రమాణా లతో కూడిన విద్య అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఉపాధ్యాయు లను సిబ్బందిని ఆదేశించారు. మ ల్యాలలోని కస్తూర్బా గాంధీ విద్యాల యాన్ని కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల నిర్వహణ, పారిశుద్యం, మౌళిక వస తులు, విద్యార్థుల సౌకర్యాలు పరిశీలించారు. విద్యార్థులు చదువు స్థితిగతులు, వారికం దిస్తున్న సౌకర్యాలను ప్రత్యేక అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యా యులు సమయపాలన పాటించాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్‌ విద్యార్థులతో ముచ్చటించారు. బోజన తయారిలో నాణ్యత ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహరం అందించాలని అన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, డీఈవో రాము, మండల విద్యాధికారి జయసింహరావు, ప్రత్యేక అధికారి స్రవంతి పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:23 AM