Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:21 AM

వైద్యులు, సిబ్బంది నిత్యం అందు బాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

గంభీరావుపేట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : వైద్యులు, సిబ్బంది నిత్యం అందు బాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను బుధ వారం కలెక్టర్‌ పరిశీలించారు. ముందుగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇన్‌పేషెంట్ల వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్‌రూం, వ్యాక్సినేషన్‌ గది, ఎక్స్‌రే గది, యునాని హాస్పి టల్‌, ఆసుపత్రి ఆవరణ పరిశీలించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌కుమా ర్‌, డీఎంహెచ్‌వో రజిత, డీసీహెచ్‌ఎస్‌ రవీందర్‌, సర్పంచ్‌ మల్లుగారి పద్మ, తహసీల్దార్‌ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్‌, డాక్టర్‌ సృజన్‌ ఉన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:21 AM