Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:46 AM

ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా వైద్యాధికారి సుజాతను సన్మానిస్తున్న సిబ్బంది

-జిల్లా వైద్యాధికారి సుజాత

రాయికల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఆశా డే కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మొదటిసారి ఆరోగ్య కేంద్రానికి వచ్చిన జిల్లా వైద్యాధికారిని సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ కస్తూరి సతీష్‌, డీపీవో రవీందర్‌, సీహెచ్‌వో సాగర్‌ రావు, స్టాఫ్‌ నర్సు మౌనిక, ఫార్మాసిస్ట్‌ దీపిక, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజమణి, హెల్త్‌ అసిస్టెంట్‌ భూమయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:47 AM