విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:21 AM
వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందించాల ని, అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలి పివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, శనివారం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
బోయినపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందించాల ని, అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలి పివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, శనివారం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు నీరం దించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మోటార్లు కాలిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ పదేపదే వచ్చిపోవ డంతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయ ని, ఇప్పటికే పెట్టుబడుల భారంతో సతమత మవుతున్న రైతులకు అదనపు ఖర్చులు భారంగా మారుతున్నాయని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అందించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం రైతులకు సరిపడా విద్యుత్ అందించడంలో ఎదురవుతున్న సమ స్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి విపత్కర పరి స్థితుల్లోనూ రైతులకు విద్యుత్ సరఫరా కొన సాగించిన విషయాన్ని ప్రస్తావించారు. రైతుల సంక్షేమం గురించి చెప్పడమే కాకుండా క్షేత్ర స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించాలని, అప్రకటిత విద్యుత్ కోతలను నివారించి నాణ్య మైన విద్యుత్ అం దించాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ ప్రశాంత్‌తో కలిసి నాయ కులు సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను పరిశీ లించి, విద్యుత్ సర ఫరాకు సంబంధించి న వివరాలను తెలు సుకున్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య , సరఁంచులు అనుముల భాస్కర్, కట్ట గోవర్దన్, మాజీ జడ్పీ టీసీ కొనుకటి లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, కవ్వం పెల్లి రాములు, కొంకటి శేఖర్, లాల్ పర్శరా ములు, బూర్గుల నందయ్య, పి. శివ,ఎరువాల అనిల్, బాలరాజు, ల్యాద రమేష్, గూడ బాల కిషన్, చెంచు సంపత్, పెంతల బాలకిషన్, ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.