Share News

కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని ధర్నా

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:40 AM

సిరిసిల్లలో కాటన్‌ వస్త్రా లకు యజమానులు కూలీ పెంచాలంటూ సోమవారం చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనం ఎదుట కార్మికులు, ఆసాములతో ధర్నా చేస్తా మని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ తెలిపారు.

కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని ధర్నా

సిరిసిల్ల అర్బన్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో కాటన్‌ వస్త్రా లకు యజమానులు కూలీ పెంచాలంటూ సోమవారం చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనం ఎదుట కార్మికులు, ఆసాములతో ధర్నా చేస్తా మని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ తెలిపారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌ లాల్‌ శుక్లా కార్మిక భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ కాటన్‌ వస్త్రానికి కూలీ అగ్రిమెంట్‌ ముగిసిపోయి చాలా కాలం అవుతోందన్నారు. కూలీ పెంచాలని యజమానులకు నోటీ సులు అందించిన కూలీ పెంచడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో కార్మికులకు ఇస్తున్న కూలీ సరి పోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాటన్‌ వస్త్రాలను తయారు చేసే కార్మికులకు రోజకు రూ. 300 వేతనం కూడా రావడం లేదన్నారు. నమ్ముకున్న వృత్తిలో పనిచేస్తే కుటుంబంపోషించుకోలేక ఇతర వృత్తికి వెళ్లలేక నేత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురైతున్నాయన్నారు. యాజమానులు కార్మికుల కష్టాలను గుర్తించి ప్రస్తుతం పెరిగిన ధరల కు అనుగుణంగా కూలీ పెంచాలని కోరారు. సోమవారం కాటన్‌ కార్మి కులు, ఆసాములు బీవైనగర్‌లోని సీఐటీయూ కార్యాలయానికి ఉద యం 9 గంటల వరకు చేరుకుంటే ర్యాలీగా చేనేత వస్త్ర వ్యాపార సంఘభవనం కు వెళ్లి ధర్నాను చేయడం జరుగుతుందన్నారు. అందరు సకాలంలో వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, అన్నల్‌దాస్‌ గణేష్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:40 AM