Share News

సీఈసీని తొలగించాలని ఆందోళన

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:00 AM

కేంద్రంలోని బీజేపీ గుప్పిట్లో పని చేస్తూ రాజ్యాంగానికి దేశ వ్యాప్తంగా విరుద్ధంగా బీజేపీ వ్యతిరేక ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం సిరిసి ల్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

సీఈసీని తొలగించాలని ఆందోళన

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ గుప్పిట్లో పని చేస్తూ రాజ్యాంగానికి దేశ వ్యాప్తంగా విరుద్ధంగా బీజేపీ వ్యతిరేక ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం సిరిసి ల్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఆయా పార్టీలు జెండాలతో గాంధీచౌక్‌ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం గాంధీచౌక్‌ వద్ద ధర్నా చేపట్టి సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మాట్లాడారు. రానున్న రోజుల్లో ఓటమి తప్పదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తన జేబులో పెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. జిల్లాలోనే 90 వేల ఓట్లు తొలగించారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు 13కోట్ల ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ముస్లింలు, దళితుల ఓట్లను తొలగించిందన్నారు. తొలగించిన ప్రతిఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఇండియా కూటమికి ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన ఓటు హక్కును తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే వరకు ఇండియా కూటమి ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనక య్య, కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగు ల జగన్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, సీపీఐ నియోజకవర్గం ఇంచార్జి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌, నాయకులు కంసాల మల్లే శం, లక్ష్మన్‌, నర్స య్య, చందన, రవీందర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:00 AM