Share News

బీఆర్‌ఎస్‌ మహిళా నేతల నిరసన

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:42 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం చెందిందంటూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళా సద స్సు, వంటావార్పు నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ మహిళా నేతల నిరసన

సిరిసిల్ల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం చెందిందంటూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళా సద స్సు, వంటావార్పు నిర్వహించారు. మహిళలు వంటలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యా లపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, మహిళలతో సదస్సు నిర్వహించారు. మహిళలు ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమె త్తారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలు మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను నేరవేర్చలేదన్నారు. పేద మహిళలకు నెలకు రూ.2500, రూ.4వేల పెన్షన్‌, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్‌, ఆడబిడ్డల పెళ్లి ళ్లకు తులం బంగారం, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు స్కూటీల వంటీ హామీల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్‌ పాలన వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న ఒక్క హామీని పూర్తి చేయలేదన్నారు. మహిళా డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన హామీల ఊసే లేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల న్నారు. మహిళలను, వృద్ధులను, దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్‌ ఉనికి లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఆకునూరు శంకరయ్య, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, మాజీ జడ్పీటీసీ రేణుక, సెస్‌ డైరెక్టర్‌ ధార్నం లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, మ్యాన రవి, దిడ్డి శ్రీనివాస్‌, మహిళా అధ్యక్షురాలు బత్తుల వనజ, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:42 AM