రాజ్యాంగ విలువల పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:09 AM
రాజ్యాం గ విలువల పరిరక్షణ అందరి బాధ్యత అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాం గ విలువల పరిరక్షణ అందరి బాధ్యత అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి ఆధ్వర్యంలో రాజ్యాంగ చైతన్య ర్యాలీని చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ లోని నేతన్న విగ్రహం నుంచి చేపట్టిన ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ప్రారంభించి పాల్గొన్నారు. అనంత రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించా రు. ఈ సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాం గ పరిషత్ మన భారత రాజ్యాంగా న్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన అంబే ద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించాలనే గొప్ప ఆశయంతో రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, లింగంపల్లి శంకర్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంటి మహేష్, పార్లమెంట్ కో-కన్వీ నర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధానకార్యదర్శులు పొన్నాల తిరుప తిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, సోషల్‌మీడియా కన్వీనర్ జూకంటి అఖి ల్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, రేగుల శ్రీకాంత్, మైనా రిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్ సాబీర్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు వంతడుగుల సుధాకర్, మల్లారపు తిరుపతి,, వీర్నపల్లి మండల అధ్యక్షులు లకుపతి నాయక్, వేములవాడ అర్బ న్ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్, నాయకుల పాల్గొన్నారు.