Share News

బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత..

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:28 AM

బాలల హక్కుల పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతగా గుర్తించాలని బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత..
కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి

కరీంనగర్‌ అర్బన్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కుల పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతగా గుర్తించాలని బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి అన్నారు. బాలల హక్కుల వేడుకల ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి మాట్లాడుతూ.... బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, బాలలకు ప్రోత్సాహం అందించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) సభ్యులు కళింగ శేఖర్‌, విజయ్‌, డీఎంహెచ్‌వో రామారావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్‌, సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సంపత్‌, సిబ్బంది, సీసీఐ, పాఠశాల చిన్నారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:28 AM