బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - May 15 , 2026 | 11:51 PM
బాలల హక్కుల రక్ష ణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్ల, మే 15 (ఆంధ్ర జ్యోతి): బాలల హక్కుల రక్ష ణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్త్రీ, మహిళా, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్స్ సంక్షమ శాఖ ఆద్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో బాలల హక్కుల పరిరక్షణపై సర్పంచులు, మున్సిపల్ వార్డ్‌సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లకు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, బాలల హక్కుల పరి రక్షణ కమిషన్ సభ్యులు వచన్ కుమార్‌రెడ్డి, బండి అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, వందనగౌడ్, ప్రేమలత అగ్రవాల్ హాజరయ్యారు. పిల్లల రక్షణ సమా జం బాధ్యత టోల్‌ఫ్రీ నంబర్లతో రూపొందించిన పోస్టర్ల ను ఆవిష్కరించారు. కిశోర బాలికలకు శిక్షణ ఇచ్చేం దుకు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా కమి షన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడు తూ ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో బాలల హక్కు ల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, బాల్య వివా హాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. పాఠశాల ల్లో డ్రాప్ ఔట్లు ఉండవద్దని, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో సౌకర్యాలపై వివరించి ప్రవేశం కల్పిం చాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ అభివృద్ధితోపాటు ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసి బాలల స్థితిగతులు, ఇబ్బందులు గుర్తించాలని సూచించారు. 1098 హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. బాలలే దేశ భవిష్యత్ అని, అందరి సహ కారంతోనే ప్రతి సామాజిక రుగ్మతలోని నిర్మూలించవ చ్చని పేర్కొన్నారు. మగ, ఆడపిల్లల ఇద్దరం సమాన మని స్పష్టం చేశారు. ప్రతి వివాహం నమోదుకావాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలపై వివ రించాలని తెలిపారు. ఆరు ఏళ్లలోపు పిల్లలు చేర్పిం చాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను జిల్లా అధికా రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాల బాలిక లకు అవగాహన కల్పించాలని, చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యమని తెలిపారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 18 ఏండ్ల లోపు బాల, బాలికలను కమిటీలు సంరక్షించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికా హారం అందించాలని తెలిపారు. జిల్లాలో 100కు పైగా అంగన్వాడీల భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు నిరోధించాలని ఆదేశించారు. సర్పంచ్‌లు అంగన్‌వాడీకేంద్రాలు, స్కూల్స్ లో సందర్శించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమంతోపాటు చిన్నారులు హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిరోధానికి ప్రభుత్వ అనేక పథకాలు అమలుచేస్తుందని వివరిం చారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రానున్నాయని, గ్రామా ల్లో పిల్లలు స్కూల్స్ నుంచి డ్రాప్‌ఔట్ కావద్దని తెలి పారు. విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, డైట్ చార్జీలు 40శాతం, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతి గ్రామం లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, సర్పంచులు, కార్యద ర్శులు బాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వర కు కొంటామని స్పష్టం చేశారు. ధాన్యం తరలింపునకు లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు అందుబాటులో పెట్టామని, ఇప్పటివరకు 40 శాతానికి పైగా కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో కార్మిక, ధార్మిక క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, జిల్లాలో రూ వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డ్‌లో బాలల హక్కుల కమి టీ ఏర్పాటు చేయాలని సూచించారు. చట్టప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిపారు. అనాథలకు ప్రభు త్వం ప్రతి నెలా మిషన్ వాత్సల్య కింద ప్రతి నెలా రూ 4 వేల సహాయం అందిస్తుందని, జిల్లాలో 117మంది పిల్లలకు ప్రతినెలా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఉంటే తమ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పిల్లలను దత్తత కూడా చట్ట ప్రకారం తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పంచాయతీ కార్యద ర్శి అంగన్‌వాడీకేంద్రాల్లో పోషకాహారం ఇస్తున్నారా లేదా పరిశీలించాలని, ప్రతి వారంలో ఒక రోజు పంచాయతీ కార్యదర్శి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచిం చారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొ న్నారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారులతో కలి సి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కల్పించామని తెలిపారు. షీటీమ్‌లు ఏర్పాటు చేసి మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాజేంద ర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూ పారెడ్డి, రాములునాయక్, రాజు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.