Share News

ప్రభుత్వ భూములను కాపాడండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:39 AM

రుద్రంగిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని కాపాడాలని దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌ అన్నారు.

ప్రభుత్వ భూములను కాపాడండి

రుద్రంగి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : రుద్రంగిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని కాపాడాలని దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రంగిలో ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇందూరు పోచమ్మ ఆలయం వద్ద గల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో సర్వే నంబర్‌ 428/2/3/4లో గ్రామపంచాయతీకి చెందిన ఎకరం 32గుంటల భూములను సర్వేచేసి హద్దులు నిర్ణయించి జిల్లా సర్వేయర్‌ ఇచ్చారన్నారు. ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న వాటిని జిల్లా ఆధికారులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్‌ డైరెక్టర్‌ ఆకుల గంగా రాం, ఉత్తర తెలంగాణ పీపుల్స్‌ ముూమెంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మ్యాకల చంద్రశే ఖర్‌, చేప్యాల గణేష్‌, ఉప్పులుటి గణేష్‌, గసికింటి ఆరుణ్‌, దయ్యాల ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:39 AM