Share News

వేములవాడ పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:35 PM

వేములవాడ పర్యాటక అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

వేములవాడ పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

సిరిసిల్ల టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ పర్యాటక అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలక్టర్‌ కార్యాలయాల సముదాయంలో వేములవాడ పట్టణం పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వదేశ్‌ దర్శన్‌లో భాగంగా ఆలయ అభివృద్ధితో పాటు పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు భక్తు లకు, పర్యాటకులకు అన్ని వసతులు సౌక ర్యాలు కల్పించేందుకు అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఈవో రమాదేవి, స్వదేశ్‌ దర్శన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లా నాయ క్‌, క్షేత్ర ఆర్కిటిక్‌ తేజ, పర్యాటక శాఖ ఏఈ జీవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:35 PM