Share News

పక్కా భవనాలు లేక అవస్థలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:57 AM

సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వీర్నపల్లి మండలాన్ని నూతనం గా మండలంగా ఏర్పాటు చేసింది.

పక్కా భవనాలు లేక అవస్థలు

వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), మార్చి 3 (ఆంధ్ర జ్యోతి): సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వీర్నపల్లి మండలాన్ని నూతనం గా మండలంగా ఏర్పాటు చేసింది. సర్కారు అందించే సంక్షేమ పథకాలు పేదల దరిచేరేలా అందుబాటులోకి తీసుకు వచ్చింది. పదేళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక అటు అధికారులు, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేవు. అద్దె గదులు, ప్రభు త్వ కార్యాలయాల్లోనే ఒకే గదిలో విధులు నిర్వ హించాల్సి వస్తోంది. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు స్వం త భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టి వివరాలను సేకరించింది. అవీ కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినవస్తున్నాయి.

అద్దె గదులు.. అరకొర వసతులు

గత ప్రభుత్వం పదేళ్ల కిందట వీర్నపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది. అన్ని శాఖల కార్యాలయాలతో సేవలను అందించేందుకు చర్య లు చేపట్టింది. వీర్నపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్‌,ఎంపీడీవో, ఎంఈవో, పోలీస్‌ స్టేషన్‌, వ్యవసాయ, ఐకేపీ, పీహెచ్‌సీలను స్థానికంగా ఉండే భవనాల్లో కొనసాగించింది. తహసీల్దార్‌ కార్యాలయం అద్దె భవనంలో సాగుతోంది. ఎంపీ డీవో, ఎంఈవో కార్యాలయాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఒక్కో గదిలో కొనసాగుతున్నాయి. స్థానిక అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన క్వర్టర్స్‌లో పోలీస్‌ స్టేషన్‌ సాగుతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయం రైతు వేదికలో, ఐకేపీ గ్రామైఖ్య సంఘం భవనం, పీహెచ్‌సీ అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో సరైనా వసతులు లేక అధికారులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు, మూత్రశాలలు, తదితర మౌలిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేవు. మహిళలు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. పోలీస్‌స్టేషన్‌ సైతం ఇరుకుగా ఉండే గదుల్లో నిర్వహించడం వల్ల బాధితులు బయట వేచి చూడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. స్వంత భవనాలకు స్థలాలను పరిశీలించిన కొన్ని కార్యాలయాలకు కేటాయించిన నిధులు మంజూ రుకాకపోవడం..మరికొన్ని కార్యాలయాలకు స్థలా లను గుర్తించకపోవడం వల్ల ఇరుకైన గదుల్లో విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోంద ని అధికారులు పేర్కొంటున్నారు. పనుల నిమి త్తం కార్యాలయాలకు వెళితే సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాల నిర్మాణ పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:57 AM