హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:44 AM
అసెంబ్లీ సాక్షిగా గ్రామపం చాయితీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రీన్ ఛానెల్‌తోనే వేతనా లు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ సాక్షిగా గ్రామపం చాయితీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రీన్ ఛానెల్‌తోనే వేతనా లు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్ట ణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో ఆదివారం గ్రామపం చాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతి థిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికుల ను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మెనిఫేస్టోలో పెట్టిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 36నెలల గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఇచ్చిన హామీలను అమలు చేసి కార్మికులకు రెండవ పీఆర్సీ పరిధిలోకి తీసుకుని కనీస వేతనం రూ.30వేలు తగ్గకుండా వేతనాలు పెంచాలంటూ కార్మికులు ఆందోళనలు, పోరాటాలు చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా హామీలను అమలు చేయాలంటూ ఈనెల 26న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు తరలిరావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి తునికి మహేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడంరమణ, అన్నల్ దాస్ గణేష్, మాల్యాల నర్సయ్య, వర్కోలు మల్లయ్య, లోకిని శ్రీనివాస్, అక్కల అంజాగౌడ్, కంసాని రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.