Share News

రెండు నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:28 PM

రెండు నెలల్లో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌ పనులను పూర్తిచేయా లని అధికారులు, కాంట్రాక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు.

రెండు నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి

రుద్రంగి, ఏప్రిల్‌ 8 (ఆంద్రజ్యోతి) : రెండు నెలల్లో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌ పనులను పూర్తిచేయా లని అధికారులు, కాంట్రాక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇరిగేషన్‌ అధికారులతో కలికోట సూరమ్మ ప్రా జెక్టు పనులు పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల వేగాన్ని పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. వచ్చే వర్షాకాలం ప్రారం భానికి ముందే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలని అన్నారు. రాత్రి సమయంలో కూడా పనులు జరిగే విధం గా చర్యలు చేపట్టాలన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్‌ మండలాల రైతులకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్టు అయిన కలికోట సూరమ్మ చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పనుల అమలు పర్యవేక్షణకు ప్రతి 11 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమా వేశాల్లో పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అధికారు లు తెలిపారు. దీంతో ప్రాంతీయ రైతులకు భారీగా లాభం చేకూరనుంది. ఇప్పటికే ప్రాజె క్ట్‌కు సంబంధించిన కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్త యిందని, త్వరలోనే కాలువల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ సంతూ ప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, రుద్రంగి సర్పంచ్‌ గండి నారాయణ, ఉప సర్పంచ్‌ మాడిశేట్టి అభిలాష్‌, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల గగన్‌, పూదరి మహిపాల్‌, ఎర్రం అరవింద్‌, తర్రె లింగం, దయ్యాల శ్రీనివాస్‌, దసారి గంగారాజం తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 11:29 PM