Share News

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:49 PM

ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయ శంకర్‌ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయ శంకర్‌ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొని జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమయం లో ఉద్యమ స్ఫూర్తిని సమాజంలోని అన్ని వర్గాలకు చైతన్యం నింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. సమాజం పట్ల నిబద్ధతో అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:49 PM